Anasuya Bharadwaj: ఆ డైరెక్టర్ అంటే అనసూయకు ఎందుకు మంట… మళ్ళీ గెలికిందిగా!

ఎంతో డిగ్నిటీ గా వ్యవహరించాలి. ఆధిపత్యం చూపించకూడదు. కోపంలో ఇష్టమొచ్చినట్టుగా ప్రవర్తిస్తాం .. తప్పులు చేస్తాం ..కానీ అలా చేయకూడదు. భాగస్వామిపై ఎప్పుడూ చెయ్యి ఎత్తకూడదు.

Written By: S Reddy, Updated On : March 2, 2024 8:49 am
Follow us on

Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగను మళ్ళీ గెలికింది. దర్శకులు సందీప్ రెడ్డి , గౌతమ్ మీనన్ వేరు వేరు సందర్భాల్లో చేసిన కామెంట్స్ జోడించి ఓ రీల్ షేర్ చేసింది. గతంలో కూడా అనసూయ అర్జున్ రెడ్డి సినిమా గురించి చేసిన కామెంట్స్ ఎంత దుమారం రేపాయో తెలిసిందే. ఇక తాజాగా మరో కాంట్రవర్సీకి అనసూయ తెర లేపింది. సందీప్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో యానిమల్ సినిమాలో కొన్ని సన్నివేశాల గురించి మాట్లాడుతూ .. ఓ రిలేషన్ లో కొట్టుకోవడం, తిట్టుకోవడం వంటివి లేకపోతే అది ప్రేమ కాదని అన్నారు.

అది ఒక బంధం, లైన్ గీసుకుని జీవిస్తున్నట్లే అని సందీప్ రెడ్డి తన అభిప్రాయం తెలియజేశాడు. కాగా అదే సమయంలో గౌతమ్ మీనన్ గతంలో ఆడవారి గురించి, ప్రేమ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో గౌతమ్ మీనన్ .. అసలు ఓ అమ్మాయి మీద ప్రేముంటే వాళ్ళని బలవంతం పెట్టొద్దు. చెడుగా మాట్లాడొద్దు .. ఓ రిలేషన్ లో ఒడిదుడుకులు ఉంటాయి. కానీ కోపాన్ని మాత్రం వారి మీద ఇష్టమొచ్చినట్టుగా చూపించకూడదు.

ఎంతో డిగ్నిటీ గా వ్యవహరించాలి. ఆధిపత్యం చూపించకూడదు. కోపంలో ఇష్టమొచ్చినట్టుగా ప్రవర్తిస్తాం .. తప్పులు చేస్తాం ..కానీ అలా చేయకూడదు. భాగస్వామిపై ఎప్పుడూ చెయ్యి ఎత్తకూడదు. ప్రేమగా చెప్పాలి. మనం శూన్యం .. వాళ్ళే సర్వస్వము .. అదే నిజం అని గౌతమ్ మీనం చెప్పిన మాటలను అనసూయ సందీప్ రెడ్డి మాటలతో పోల్చింది. సందీప్ రెడ్డి వంగా లాంటి వాళ్ళు ఉన్న ఈ ప్రపంచంలో గౌతమ్ మీనన్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటూ రీల్ షేర్ చేసింది.

సిల్వర్ స్క్రీన్ పై ఆడవాళ్లను హుందాగా చూపించాలని పరోక్షంగా సందీప్ రెడ్డి వంగకు ఆమె చురకలు వేసింది. ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన రీల్ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా .. అనసూయ కెరీర్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. పాన్ ఇండియాలో లెవెల్లో తెరకెక్కుతున్న పుష్ప 2లో అనసూయ కీలక పాత్ర చేస్తుంది. ఈ చిత్రంలో నెగిటివ్ రోల్ లో మెప్పించనుంది.