https://oktelugu.com/

Anasuya Bharadwaj: అందాల ఓణీ.. అనసూయ వేస్తే ఇంకా హాయి..!

అనసూయకు పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు. చాలా ఏళ్ల క్రితమే సుశాంక్ భరద్వాజ్ అనే బిహారీని అనసూయ ప్రేమ వివాహం చేసుకుంది. వీరి పెళ్ళికి అనసూయ తండ్రి ససేమిరా అన్నాడట.

Written By: , Updated On : March 12, 2024 / 10:19 AM IST
Anasuya Bharadwaj half saree Photos

Anasuya Bharadwaj half saree Photos

Follow us on

Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్... తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక బ్రాండ్. గ్లామర్ కి కేర్ ఆఫ్ అడ్రస్. నాలుగు పదుల వయసు దగ్గరపడుతున్నా యంగ్ బ్యూటీస్ కూడా ఆమె ముందు దిగదుడుపే. చూడగానే మత్తెక్కించే గ్లామరస్ మైంటైన్ చేస్తుంది. తాజాగా లంగా ఓణీలో అనసూయ సోయగాల విందు చేసింది. కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపింది. ఒక్కడు చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్… ‘నువ్వేం మాయ చేశావో కానీ’ సదరు గ్లామరస్ వీడియోకి జోడించింది. అనసూయ ఫేస్ బుక్ స్టేటస్ వైరల్ గా మారింది. ఇక ఫ్యాన్స్ ఆమె అందాలను ప్రశంసించకుండా ఉండలేకున్నారు.

అనసూయకు పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు. చాలా ఏళ్ల క్రితమే సుశాంక్ భరద్వాజ్ అనే బిహారీని అనసూయ ప్రేమ వివాహం చేసుకుంది. వీరి పెళ్ళికి అనసూయ తండ్రి ససేమిరా అన్నాడట. పట్టుబట్టి తన ప్రేమను దక్కించుకుంది. కెరీర్ బిగినింగ్ లో అనసూయ హెచ్ ఆర్, న్యూస్ రీడర్ జాబ్స్ చేసింది. నటి కావాలనేది ఆమె ఆకాంక్ష. ఆ ప్రయత్నాలు కూడా చేసింది. అయితే అనసూయకు జబర్దస్త్ బ్రేక్ ఇచ్చింది.

2013లో జబర్దస్త్ కామెడీ షో ప్రయోగాత్మకంగా స్టార్ట్ చేశారు. అది ట్రెమండస్ సక్సెస్ కావడంతో యాంకర్ అయిన అనసూయ స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది. గ్లామరస్ యాంకర్ గా ట్రెండ్ సెట్ చేసింది. ఇక అనసూయ డ్రెస్సింగ్ పై అనేక విమర్శలు వినిపించాయి. కానీ ఆమె పట్టించుకోలేదు. పైగా నా డ్రెస్ నా ఇష్టం నన్ను జడ్జి చేయడానికి మీరు ఎవరు అంటూ కొట్టిపారేసింది. కాగా అనసూయ 2022లో యాంకరింగ్ నుండి తప్పుకుంది. పూర్తి స్థాయి నటిగా మారింది.

గత ఏడాది అనసూయ విలక్షణ పాత్రలు చేసి ఆకట్టుకుంది. రంగమార్తాండ, విమానం, పెదకాపు 1, ప్రేమ విమానం చిత్రాల్లో ఆమె నటించారు. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్ట్స్ తో అనసూయ బిజీగా ఉంది. అనసూయ ఖాతాలో పుష్ప 2 వంటి భారీ ప్రాజెక్ట్ ఉంది. అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. అనసూయ కీలక రోల్ చేసిన రజాకార్ మూవీ మార్చి 15న విడుదల కానుంది.