Anasuya Bharadwaj: అనసూయ రెండు చేతులా సంపాదిస్తుంది. ఒక ప్రక్క నటిగా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తుంది. అలాగే షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ ద్వారా లక్షలు ఆర్జిస్తోంది. ఈ మధ్య అనసూయ ప్రతి నెల కొన్ని షాప్స్ ఓపెన్ చేస్తున్నారు. ఏపీ/తెలంగాణాలలో చాలా మంది వ్యాపారాలు అనసూయను షాప్ ఓపెనింగ్స్ కి పిలుస్తున్నారు. ఆమెది లక్కీ హ్యాండ్ అని నమ్ముతున్నారు. అనసూయ తమ షాప్ ఓపెనింగ్ కి వస్తుంది అంటే… పెద్ద ఎత్తున జనాలు, కుర్రాళ్ళు గుమిగూడుతున్నారు. దాంతో మంచి పబ్లిసిటీ దక్కుతుంది.
సదరు షాప్ ఓపెనింగ్స్ ఈవెంట్స్ లో అనసూయ పట్టు చీరలో దర్శనం ఇస్తుంది. సదరు ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది. తాజాగా పట్టుచీరలో ఆకట్టుకుంది. జాకెట్ మాత్రం టూ హాట్ గా ఉంది. బ్యాక్ లెస్ బ్లౌజ్ ధరించి అనసూయ కుర్రాళ్లను కవ్వించింది. సాంప్రదాయ చీరలో కూడా అనసూయ గ్లామర్ యాంగిల్ వదల్లేదు. అనసూయ ఫోటోలు వైరల్ అవుతుండగా నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
అనసూయ ఈ ఏడాది మైఖేల్, రంగమార్తాండ, విమానం, పెదకాపు 1, ప్రేమ విమానం వంటి చిత్రాల్లో నటించింది. విలక్షణమైన పాత్రలతో అలరించింది. విమానం మూవీలో అనసూయ వేశ్యగా నటించిన విషయం తెలిసిందే. రంగమార్తాండ లో కూడా ఆమెకు కీలక రోల్ దక్కింది. పెదకాపు 1 విజయం సాధిస్తే అనసూయకు మరింత పేరు వచ్చేది. కథను మలుపు తిప్పే పాత్రలో నటించినప్పటికీ పెదకాపు డిజాస్టర్ కావడంతో అనసూయ గురించి పెద్దగా వినిపించలేదు.
నెక్స్ట్ అనసూయ పుష్ప 2లో సందడి చేయనుంది. ప్రధాన విలన్స్ సునీల్, ఫహాద్ ఫాజిల్ కాంబోలో అనసూయకు ఆసక్తికర సన్నివేశాలు ఉన్నాయట. ఇటీవల ఈ విషయాన్ని స్వయంగా తెలియజేసింది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప 2 వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. మరోవైపు అనసూయ బుల్లితెరకు దూరమైంది. ఇకపై యాంకరింగ్ చేసేది లేదని తేల్చి చెప్పింది. ఆమెను బుల్లితెర ఆడియన్స్ బాగా మిస్ అవుతున్నారు. జబర్దస్త్ వేదికగా అనసూయ సంచనాలు చేసింది.
View this post on Instagram