Homeఎంటర్టైన్మెంట్Anasuya Bharadwaj: విశాలమైన వీపు చూపుతూ మనసులు దోచేసిన అనసూయ... కుర్రాళ్ళ క్రేజీ కామెంట్స్, గ్లామరస్...

Anasuya Bharadwaj: విశాలమైన వీపు చూపుతూ మనసులు దోచేసిన అనసూయ… కుర్రాళ్ళ క్రేజీ కామెంట్స్, గ్లామరస్ ఫోటోలు వైరల్

Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ కెరీర్ పీక్స్ లో ఉంది. ఆమె లేటెస్ట్ మూవీ రజాకార్ ఇటీవల విడుదలైంది. హైదరాబాద్ సంస్థానంలో ఒకప్పుడు జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. రజాకార్లు హిందువుల మీద మారణకాండ సాగించారని ఈ చిత్ర సారాంశం. రజాకార్ మూవీ అనేక వివాదాలు ఎదుర్కొంది. చరిత్రను వక్రీకరించి తీశారనే విమర్శలు వినిపించాయి. పొలిటికల్ ప్రాపగాండ చిత్రమని కొందరు అభిప్రాయపడ్డారు. కాగా రజాకార్ మూవీలో అనసూయ కీలక రోల్ చేసింది. ప్రేమ, ఇంద్రజ, బాబీ సింహ ఇతర ప్రధాన పాత్రలు చేశారు.

ఈ చిత్ర ప్రమోషన్స్ లో విరివిగా పాల్గొంది అనసూయ. ఒక ప్రక్క సినిమాలు చేస్తున్న అనసూయ ప్రమోషనల్ ఈవెంట్స్ తో బిజీగా గడుపుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వ్యాపారులు అనసూయ కోసం ఎగబడుతున్నారు. తమ వ్యాపార సముదాయాలను ఆమె చేత ఓపెన్ చేయిస్తున్నారు. ఏడాది కాలంలో పదుల సంఖ్యలో షాపింగ్ మాల్స్ ఓపెన్ చేసింది అనసూయ. తాజాగా మరో నగరంలో ఒక షాపింగ్ మాల్ కి రిబ్బన్ కటింగ్ చేసింది.

పట్టు చీర, బ్యాక్ లెస్ జాకెట్ ధరించి సూపర్ గ్లామరస్ గా దర్శనం ఇచ్చింది. అనసూయ రాకను తెలుసుకున్న కుర్రాళ్ళు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. అనసూయను చూసేందుకు ఎగబడ్డారు. అనసూయ తన ఫ్యాన్స్ కి అభివాదం చేయడంతో పాటు వారిని పలకరించింది. సదరు డ్రెస్ లో అనసూయ ఫోటో షూట్ చేసింది. అనసూయ అందాలు చూసి వెర్రెత్తిపోయిన కుర్రాళ్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అనసూయ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఇక అనసూయ సినిమాల విషయానికి వస్తే… నెక్స్ట్ ఆమె పుష్ప 2లో కనిపించనుంది. దాక్షాయిణిగా లేడీ విలన్ రోల్ లో అలరించనుంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప 2 ఆగస్టు 15న విడుదల కానుంది. అలాగే మరికొన్ని ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి. అయితే అనసూయ యాంకరింగ్ కి గుడ్ బై చెప్పింది. జబర్దస్త్ తో పాటు బుల్లితెర షోల నుండి తప్పుకుంది. బుల్లితెర ఆడియన్స్ ఆమెను ఎంతగానో మిస్ అవుతున్నారు. అందుకే సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటుంది.

Exit mobile version