Anasuya Bharadwaj: మనసులోని ఫీలింగ్ ఏదైనా బోల్డ్ గా బయటపెట్టేస్తుంది అనసూయ. కోపమైనా ఆనందమైనా, ద్వేషమైనా, ప్రేమైనా వెళ్లగక్కేస్తుంది. కాగా ప్రియమైన శ్రీవారి పుట్టినరోజును అనసూయ తనదైన శైలిలో సెలెబ్రేట్ చేసింది. స్పెషల్ గా కేక్ తెప్పించి, దానిపై ‘హ్యాపీ బర్త్ డే టు స్ట్రెంత్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ’ అని రాయించింది. తన ఇద్దరు కుమారులతో పాటు సుశాంత్ కి బర్త్ డే విషెస్ తెలియజేసింది. ఇక సుశాంత్ గురించి ఆమె రాసిన కామెంట్ వైరల్ అవుతుంది.
నీ లాంటి కొడుకు, నీ లాంటి భర్త , నీలాంటి తండ్రి, నీలాంటి అల్లుడు, నీలాంటి అన్న, మొత్తంగా నీలాంటి మగాడు ఈ ప్రపంచానికి కావాలి. హ్యాపీ బర్త్ డే సుశాంక్ భరద్వాజ్ అంటూ రాసుకొచ్చింది. భర్త మీద అనసూయకు ఎంత ప్రేమ ఉందో ఆమె కామెంట్ ద్వారా అర్థం అవుతుంది. సుశాంక్ ని అనసూయ ప్రేమ వివాహం చేసుకుంది. సినిమాకు మించిన నాటకీయత వీరి ప్రేమకథలో ఉంది.
స్కూల్ డేస్ లో మొదలైన ప్రేమ కథ ఏళ్ల తరబడి సాగింది. మొదటిసారి ఒక ఎన్ సి సి క్యాంపులో కలుసుకున్నారట. తర్వాత బ్రేక్ వచ్చిందట. కాలేజ్ డేస్ లో మరోసారి ఎన్ సి సి క్యాంపులో కలిశారట. అప్పుడు ప్రేమను వ్యక్తం చేసుకున్నారట.సుశాంక్ తో పెళ్ళికి అనసూయ ఫాదర్ ససేమిరా అన్నాడట. దాంతో ఇంటి నుండి బయటకు వచ్చేసి హాస్టల్ లో మకాం పెట్టిందట. పేరెంట్స్ పెళ్ళికి ఒప్పుకునే వరకు డేటింగ్ చేశారట. ఎట్టకేలకు అనసూయ కుటుంబం ఎస్ చెప్పడంతో పెళ్లి చేసుకున్నారట.
పెళ్లయ్యాక అనసూయ పరిశ్రమకు వచ్చి సక్సెస్ అయ్యింది. జబర్దస్త్ ఆమె ఫేట్ మార్చేసింది. స్టార్ యాంకర్ గా ఎదిగి లైఫ్ లో సెటిల్ అయ్యింది. ప్రస్తుతం నటిగా కొనసాగుతుంది. ఇకపై యాంకరింగ్ చేసేది లేదని ఆమె చెప్పారు. బుల్లితెర షోల్లో టీఆర్పీ స్టంట్స్ ఎక్కువైపోయాయి. అందుకే యాంకరింగ్ వదిలేశానని అనసూయ అన్నారు. ఇటీవల ఆమె పెదకాపు 1 చిత్రంలో కీలక రోల్ చేసింది.
View this post on Instagram