Anasuya Bharadwaj: అనసూయ బుల్లితెరను వీడి ఏడాది కావస్తున్నా ఆమెను జనాలు యాంకర్ అనే పిలుస్తున్నాను. నటి అనడం లేదు. దానికి కారణం ఆమె యాంకర్ గానే అందరికీ పరిచయం. అలాగే యాంకర్ గా ఆమె వేసిన ముద్ర అలాంటిది. తెలుగులో హాట్ యాంకర్స్ లేరు. నిండైన బట్టల్లో గలగలా మాట్లాడటమే తెలుగు యాంకర్స్ ప్రధాన లక్ష్యం. స్కిన్ షో చేయడం అనే కాన్సెప్ట్ లేదు. హిందీ యాంకర్స్ లో ఈ సాంప్రదాయం ఉన్నా సుమ, ఝాన్సీ, ఉదయభాను వంటి స్టార్ యాంకర్స్ ఎప్పుడూ ఆ తరహా బట్టలు ధరించలేదు.
అనసూయ జబర్దస్త్ షోతో ఆ పద్దతికి శ్రీకారం చుట్టారు. ఆమె వారసురాళ్లుగా రష్మీ, శ్రీముఖి, విష్ణుప్రియ, వర్షిణి వంటి వాళ్ళు కొనసాగిస్తున్నారు. అనసూయ నటి కావాలనుకున్నారు. వివాహానికి ముందు ప్రయత్నాలు కూడా చేశారు. సక్సెస్ కాకపోవడంతో యాంకర్ అయ్యారు. ఈటీవీలో ప్రయోగాత్మకంగా మొదలైన జబర్దస్త్ కామెడీ షో యాంకర్ గా ఆమెకు అవకాశం దక్కింది.
వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్న అనసూయ స్టార్ అయ్యారు. గ్లామరస్ యాంకర్ అన్న ఇమేజ్ త్వరగా పాప్యులర్ చేసింది. అనసూయ అంటే హాట్ యాంకర్ యాంకర్ అని జనాలు ఫిక్స్ అయ్యారు. పొట్టిబట్టల్లో స్కిన్ షోకి తెరలేపింది. ఈ క్రమంలో ఎన్ని విమర్శలు వచ్చినా అనసూయ వెనకడుగు వేయలేదు. పైగా విమర్శించే వాళ్లకు కౌంటర్లు ఇస్తూ సమర్థించుకుంది.
కాగా అనసూయ యాంకరింగ్ మానేసిన విషయం తెలిసిందే. అందుకు ఆమె పలు కారణాలు చెప్పారు. అయితే అదే తనకు మైనస్ అంటున్నారు కొందరు. అనసూయకు క్రేజీ ఆఫర్స్ రాకపోవడానికి ఇది ప్రధాన కారణమని అభిప్రాయపడుతున్నారు. బుల్లితెర ఆడియన్స్ కి దూరమైన అనసూయ క్రేజ్ తగ్గింది. అందుకే ఆమెను సపోర్టింగ్, క్యారెక్టర్ రోల్స్ కి పరిమితం చేస్తున్నారని అంటున్నారు. అనసూయ జబర్దస్త్ యాంకర్ గా కొనసాగి ఉంటే ఆమెకు లీడ్ క్యారెక్టర్స్ వచ్చేవంటున్నారు. ఈ విశ్లేషణలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ… ఓ వాదన మొదలైంది.