Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ కెరీర్ పీక్స్ లో ఉంది. వరుస చిత్రాలతో ఆమె ఫుల్ బిజీగా ఉన్నారు. అనసూయ లేటెస్ట్ మూవీ ప్రేమ విమానం. పీరియాడిక్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించిన ఈ చిత్రంలో పేద ఇల్లాలి పాత్ర చేసింది. సంగీత్ శోభన్, శాన్వి హీరో హీరోయిన్స్ గా నటించారు. జీ 5లో ప్రేమ విమానం స్ట్రీమ్ అవుతుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో అనసూయ విరివిగా పాల్గొంది. కాగా ప్రేమ విమానం డీసెంట్ టాక్ తెచ్చుకుంది. ఆడియన్స్ పాస్ మార్క్స్ వేశారు. అనసూయ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి.
ఈ ఏడాది అనసూయ నటించిన నాలుగో చిత్రం ప్రేమ విమానం. రంగమార్తాండ, విమానం, పెదకాపు 1 చిత్రాల్లో ఆమె కీలక రోల్స్ చేశారు. అనసూయకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు దక్కడం మరొక విశేషం. ఓ తరహా పాత్రలకు అనసూయ కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యింది. విమానం చిత్రంలో అయితే ఏకంగా వేశ్య రోల్ చేసి మైండ్ బ్లాక్ చేసింది. సాంప్రదాయ హీరోయిన్స్ చేయని సాహసం ఇది. ఇక రంగమార్తాండలో మోడరన్ కోడలు పాత్రలో అలరించింది.
అనసూయ చేతిలో పుష్ప 2వంటి భారీ చిత్రం ఉంది. ఆ మూవీలో దాక్షాయనిగా నెగిటివ్ రోల్ లో అలరించనుంది. పుష్ప పార్ట్ 1లో అనసూయ పాత్రను ఆసక్తికరంగా ముగించారు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తుండగా అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. పుష్ప 2 వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. అలాగే మరికొన్ని చిత్రాలు, సిరీస్లలో అనసూయ నటిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు సోషల్ మీడియాలో అనసూయ సందడి ఓ రేంజ్ లో ఉంది. హాట్ హాట్ ఫోటో షూట్స్ తో ఆకారేపుతుంది. తాజాగా కన్నుకొడుతూ చిలిపిగా కవ్వించింది. అమ్మడు రొమాంటిక్ ఫోజులు నెటిజెన్స్ గుండెల్లో గుబులు రేపుతున్నాయి. అనసూయ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. అనసూయపై సోషల్ మీడియాలో తీవ్రమైన నెగిటివిటీ నడుస్తుంది. విజయ్ దేవరకొండను అనసూయ ఉద్దేశపూర్వకంగా గెలికిన తర్వాత మరింత ఎక్కువైంది. అనసూయ ఐ డోంట్ కేర్ యాటిట్యూడ్ తో ముందుకు వెళుతుంది. అటు పర్సనల్ లైఫ్ ఇటు ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది.
View this post on Instagram