అయితే.. ఇంత స్టార్ డమ్ రాత్రికి రాత్రే వచ్చింది కాదు. ఎన్నో కష్టాలు, మరెన్నో ఇబ్బందులతోనే అనసూయ సినీ ప్రయాణం మొదలైంది. తెలుగు అమ్మాయైన అనసూయ ఎంబీఏ పూర్తి చేసి, మొదట్లో స్టాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరింది. ఆ తర్వాత జాబ్ కు ఫుల్ స్టాప్ పెట్టి.. యాక్టింగ్ వైపు అడుగులు వేసింది.
ఓ న్యూస్ ఛానెల్‌లో పని చేస్తున్న క్రమంలోనే అనసూయకు ‘జబర్దస్త్’ ఆఫర్ వచ్చింది. ఈ కామెడీ షోతో వచ్చిన పాపులారిటీని సరిగ్గా ఉపయోగించుకున్న అనసూయ.. సినిమా అవకాశాలనూ అందుకుంది. ‘సోగ్గాడే చిన్ని నాయన’, ‘క్షణం’, ‘రంగస్థలం’, ‘కథనం’ వంటి సినిమాలతో సత్తాచాటింది. ఇప్పుడు.. దాదాపు అరడజను సినిమాలు చేతిలో ఉన్న ఈ బ్యూటీ.. కరోనా గోల లేకుంటే దాదా మూడ్నాలుగు సినిమాలతో ఇప్పటికే సందడి చేసేది.
అయితే.. తాజాగా ఈ అమ్మడు నటించిన ‘థాంక్యూ బ్రదర్’ చిత్రం ఓటీటీలో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా తన పర్సనల్ విషయాలను వెల్లడించింది. ఫ్లాష్ బ్యాక్ లో వీళ్లది రాయల్ ఫ్యామిలీ అంట. చాలా ఆస్తులు ఉండేవని, తమ ఇంట్లో గుర్రాలు కూడా ఉండేవని చెప్పింది. ఈ విషయం ఇప్పటి వరకూ ఎవరికీ చెప్పలేదని వెల్లడించింది అనూ.
అయితే.. తన తండ్రికి ఉన్న చెడు అలవాట్ల వల్లనే ఆస్తి మొత్తం పోయిందని చెప్పింది. వాళ్ల నాన్నకు గుర్రపు స్వారీలు, గ్యాంబ్లింగ్ వంటి హ్యాబిట్స్ ఉండేవట. వాటి ద్వారానే ఆస్తి మొత్తం కోల్పోవాల్సి వచ్చిందట. దీంతో.. వాళ్ల కుటుంబ పరిస్థితి మొత్తం మారిపోయిందట. తాను కాలేజీలో చదువుతున్న రోజుల్లో బస్సు టికెట్ కు సైతం డబ్బులు లేకపోతే.. నడుచుకుంటూ వెళ్లేదట. ఇప్పుడు పరిస్థితి మెరుగుపడిందని తెలిపింది అనసూయ.