Anasuya
Anasuya : నాలుగు పదుల వయసుకు దగ్గరైంది అనసూయ. ఈ స్టార్ యాంకర్ కమ్ యాక్ట్రెస్ విషయంలో వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అన్నట్లు ఉంది. రోజురోజుకు అనసూయ గ్లామర్ రెట్టింపు అవుతుంది. తాజాగా స్లీవ్ లెస్ బ్లౌజ్, తెల్ల చీరలో ధరించి మంత్ర ముగ్దులను చేసింది. అందరినీ తన మాయలో పడేసింది. అనసూయ లేటెస్ట్ గ్లామరస్ ఫోటో షూట్ వైరల్ అవుతుంది. ఇక ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
గ్లామర్ ఫీల్డ్ లో అందమే పెట్టుబడి. కంటికి ఇంపుగా కనిపించినంత కాలమే కెరీర్ ఉంటుంది. అందుకే ఫిట్నెస్, బ్యూటీ కోసం సెలెబ్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అనసూయ వ్యాయామం తన దిన చర్యలో భాగం చేసుకుంది. ఉదయాన్నే కొంత సమయం అందుకు కేటాయిస్తుంది. ఇక అనసూయ శాఖాహారి. నాన్ వెజ్ జోలికి పోదు. అనసూయ మెరిసే చర్మ రహస్యం కూడా అదే. అనసూయకు అనతికాలంలో ఫేమ్ తెచ్చింది కూడా ఆమె గ్లామరస్ లుక్ కావడం విశేషం.
Also Read : అనసూయ ఫిట్నెస్ సీక్రెట్ రివీల్డ్.. పొట్టి నిక్కర్లో చెమటలు చిందిస్తున్న మాజీ జబర్దస్త్ యాంకర్!
ఇక అనసూయ కెరీర్ పరిశీలిస్తే.. జబర్దస్త్ యాంకర్ గా ఆమె పాపులర్ అయ్యారు. నటి కావాలని పరిశ్రమకు వచ్చిన అనసూయకు అవకాశాలు రాలేదు. దాంతో కొన్నాళ్ళు న్యూస్ రీడర్ గా చేసింది. 2013లో జబర్దస్త్ షో ప్రయోగాత్మకంగా మొదలైంది. ఈ షోతో అనసూయ ఓ ట్రెండ్ సెట్ చేసింది. తెలుగులో పొట్టి బట్టల్లో గ్లామర్ షో చేసిన యాంకర్స్ ఎవరూ లేరు. అనసూయతోనే ఈ సంప్రదాయం మొదలైంది. రష్మీ గౌతమ్, శ్రీముఖి తర్వాత గ్లామరస్ యాంకర్స్ గా పేరు తెచ్చుకున్నారు.
అనసూయ డ్రెస్సింగ్ పై ఎన్ని విమర్శలు వచ్చినా ఆమె లెక్క చేయలేదు. పైగా తనను విమర్శించిన వాళ్ళకు తనదైన శైలిలో ఘాటైన సమాధానం చెప్పింది. యాంకర్ గా వచ్చిన ఫేమ్ అనసూయకు సినిమా అవకాశాలు తెచ్చిపెట్టింది. అనసూయ పలు చిత్రాల్లో లీడ్ రోల్స్ చేయడం విశేషం. బడా చిత్రాల్లో ఆమెకు కీలక రోల్స్ దక్కుతున్నాయి. అనసూయ విమానం మూవీలో వేశ్యగా నటించి తన గట్స్ ఏమిటో నిరూపించుకుంది.
నటిగా బిజీ కావడంతో అనసూయ బుల్లితెరపై దృష్టి పెట్టడం లేదు. తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ కి 2022లో గుడ్ బై చెప్పింది. గత ఏడాది కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోతో రీ ఎంట్రీ ఇచ్చింది. స్టార్ మాలో ఈ షో ప్రసారమైంది. కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షో సీజన్ 2 త్వరలో ప్రసారం కానుంది. ప్రోమో సైతం విడుదల చేశారు.
Also Read : చీర కట్టులో మెస్మరైజ్ చేస్తున్న రంగమ్మత్త… వైరల్ గా అనసూయ లేటెస్ట్ ఫోటో షూట్