https://oktelugu.com/

Liger Movie: లైగర్ షూటింగ్ లో మళ్ళీ పాల్గొంటున్న అనన్య…

Liger Movie: బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ పిక్స్ తో హల్ చల్ చేస్తుండే ఈ భామ.  ఇటీవలే ఒక డ్రగ్ కేసులో ఇరుక్కుంది. షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్‌ ఖాన్‌ ను డ్రగ్స్ కేసులో  దర్యాప్తు చేస్తున్నారు ఎన్‌సీబీ.  ఇందులో భాగంగా ఆర్యన్‌ ఖాన్‌ అనన్య పాండే చాట్‌ ను  కోర్టు ముందు పెట్టింది.  ఎన్‌సీబీ ఈ చాట్ లో కొకైన్ తీసుకొస్తానని ఆర్యన్ అనడం, తనకు చరాస్ కావాలని […]

Written By: , Updated On : October 28, 2021 / 06:40 PM IST
Follow us on

Liger Movie: బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ పిక్స్ తో హల్ చల్ చేస్తుండే ఈ భామ.  ఇటీవలే ఒక డ్రగ్ కేసులో ఇరుక్కుంది. షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్‌ ఖాన్‌ ను డ్రగ్స్ కేసులో  దర్యాప్తు చేస్తున్నారు ఎన్‌సీబీ.  ఇందులో భాగంగా ఆర్యన్‌ ఖాన్‌ అనన్య పాండే చాట్‌ ను  కోర్టు ముందు పెట్టింది.  ఎన్‌సీబీ ఈ చాట్ లో కొకైన్ తీసుకొస్తానని ఆర్యన్ అనడం, తనకు చరాస్ కావాలని అనన్య అడగడం బలమైన ఆధారాలు లభించడంతో అనన్య విషయాన్ని మరింత లోతుగా విచారణ చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిందిట.

ananya pandey participated in liger movie shoot

ఈ భామ టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న “లైగర్” సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ కేసు వల్ల షూటింగ్ ఇబ్బంది ఏర్పడుతుందని అని అనుకోగా విచారణకు సహకరిస్తూనే షూట్‌లోనూ పాల్గొంటానని యూనిట్ బృందానికి చెప్పిందట అనన్య. ఈరోజు నుండి షూటింగ్ లో పాల్గొంటారట రాయల్ పామ్స్‌ దగ్గర ఉన్న డ్రీమ్‌ స్టూడియోలో ఒక సాంగ్ తీయడానికి ఏర్పాట్లు జరిగినవి ఈ సాంగ్ కొరియోగ్రఫీ బాబా బాస్కర్ రెండు రోజుల్లో ఈ పాట పూర్తి అవుతుందని సమాచారం.

ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇప్పటికే కరోనా కారణంగా చాలా ఆలస్యమైంది అనన్య కేసులో ఇరుక్కోవడంతో
ఇంకాస్త లేట్ అవుతుందని సినిమా వర్గాలు అనుకుంటున్నాయి. ప్రస్తుతం షకున్ బాత్రా డైరెక్షన్‌లో దీపికా పదుకొనెతో కలిసి ఒక సినిమా చేస్తోంది అనన్య.