Baby Movie Review: నటీనటులు : ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య , నాగబాబు, లిరీష,కుసుమ ,సాత్విక్ ఆనంద్, బబ్లూ , సీతా, మౌనిక,కీర్తన తదితరులు
దర్శకత్వం : సాయి రాజేష్
నిర్మాత : SKN
సంగీతం : విజయ్ బుల్గానిన్
సినిమాటోగ్రాఫర్ : ఏం ఎన్ బాలిరెడ్డి
ఎడిటర్ : విప్లవ్ నైషాదం
రీసెంట్ సమయం లో ట్రైలర్ మరియు పాటలతో యూత్ ని విశేషంగా ఆకట్టుకున్న మూవీ ‘బేబీ’. ఆనంద్ దేవరకొండ , వైష్ణవి చైతన్య మరియు విరాజ్ అశ్విన్ నటించిన ఈ చిత్రం పై విడుదలకు ముందు నుండే అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. కలర్ ఫోటో సినిమా నిర్మాత సాయి రాజేష్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా మారగా, ఎస్ కె ఎన్ నిర్మాతగా వ్యవహరించాడు. ట్రైయాంగులర్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ చిత్రం నేడు గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విడుదలకు ముందు రోజు రాత్రి ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ వీసీఆప్తంగా ప్రీమియర్స్ షోస్ ద్వారా మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్న ఈ సినిమా, నేడు కామన్ ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుందో ఈ రివ్యూ లో ఒకసారి చూద్దాం.
కథ :
వైష్ణవి ( వైష్ణవి చైతన్య) మరియు ఆనంద్ (ఆనంద్ దేవరకొండ) ఒక మురికివాడ ప్రాంతానికి చెందిన వారు. స్కూల్ డేస్ నుండి ప్రేమించుకుంటూ ఉంటారు. అయితే ఆనంద్ తనకి ఎదురైన కొన్ని పరిస్థితుల కారణంగా పై చదువులు చదువుకోలేక ఆటో డ్రైవర్ గా స్థిరపడిపోతాడు. కానీ వైష్ణవి మాత్రం కాలేజీ లో జాయిన్ అవుతుంది. ఎప్పుడైతే కాలేజీ లో చేరుతుందో అప్పటి నుండి వైష్ణవి రూపం దగ్గర నుండి ప్రవర్తన వరకు అన్నీ మారిపోతాయి, అదే సమయం లో విరాజ్ (విరాజ్ అశ్విన్) అనే అబ్బాయి తో బాగా క్లోజ్ అవుతుంది. ఇక్కడి నుండే వైష్ణవి, ఆనంద్ మధ్య గొడవలు రావడం ప్రారంభం అవుతాయి. అయితే ఒక అనుకోని సంఘటనల వాళ్ళ ఈ ముగ్గురి జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత ఏమి జరిగింది ? అనేది స్టోరీ.
విశ్లేషణ :
ఈ చిత్రం యూత్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ చేసిన చిత్రం గా తెరకెక్కించారు అనేది ప్రమోషనల్ కంటెంట్ చూసినప్ప్పుడే అందరికీ అర్థం అయ్యింది. దానికి తగ్గట్టుగానే సినిమా కూడా ఉంది ఫస్ట్ హాఫ్ లో వచ్చే డిఆలీగ్స్ చాలా బోల్డ్ గా, హార్డ్ హిట్టింగ్ గా ఉన్నాయి. ముఖ్యంగా హీరో , హీరోయిన్ క్యారెక్టర్స్ ని చాలా చక్కగా రాసుకున్నారు. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా బాగా ఫేమస్ అయిన వైష్ణవి చైతన్య లో ఇంత టాలెంట్ దాగి ఉందా అని ఈ చిత్రం చూసిన ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోతారు. ఫస్ట్ హాఫ్ మొత్తం అద్భుతమైన టేకింగ్ మరియు డైలాగ్స్ తో యూత్ ఆడియన్స్ థియేటర్స్ లో ఒక రేంజ్ లో ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ ఎపిసోడ్ ఫస్ట్ హాఫ్ మొత్తానికి హైలైట్ గా చెప్పుకోవచ్చు.
ఇక సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే కాస్త తగ్గినట్టు అనిపించింది, చాలా సన్నివేశాలు కొద్దిగా సాగదీసినట్టు అనిపించాయి. ప్రీ క్లైమాక్స్ కూడా సాగదీశారు కానీ సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి ఆడియన్స్ సెకండ్ హాఫ్ కి కూడా బాగా కనెక్ట్ అయిపోతారు. ఇక విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం ఈ చిత్రానికి ప్రాణం లాంటిది. అసలు ఈ సినిమాకి విడుదలకు ముందు ఇంత హైప్ రావడానికి కారణమే పాటలు. అవి వెండితెర మీద కూడా చూసేందుకు చాలా చక్కగా అనిపించాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా కీలక సన్నివేశాల్లో ప్రేక్షకులకు మంచి ఫీల్ కలిగించే విధంగా ఉంది. మొత్తానికి ‘కొబ్బరి మట్ట’ లాంటి సినిమాకి దర్శకత్వం వహించిన సాయి రాజేష్ నుండి ఇంత లోతైన లవ్ స్టోరీ ని తీసేంత టాలెంట్ ఉందని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు. బాక్స్ ఆఫీస్ పరంగా ఈ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలవొచ్చు.
చివరి మాట :
యూత్ ని ఉర్రూతలు ఊగించే విధంగా ఈ సినిమా ఉంటుంది. ఈ ఏడాది చిన్న సినిమాల హవా ని ఈ సినిమా కొనసాగిస్తుంది అని చెప్పొచ్చు.
రేటింగ్ : 3/5