Homeఎంటర్టైన్మెంట్Anand Devarakonda: " బేబీ " గా అలరించబోతున్న... ఆనంద్ దేవరకొండ

Anand Devarakonda: ” బేబీ ” గా అలరించబోతున్న… ఆనంద్ దేవరకొండ

Anand Devarakonda: విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఆనంద్ దేవరకొండ చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యారు. దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రాలలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యంగ్ హీరో. ఈ అన్నదమ్ములు ఎవరి సపోర్టు లేకుండా చిత్ర పరిశ్రమలో తమకంటూ ప్రేక్షకులలో ఒక ప్రత్యేక గుర్తింపు పొందారు.

anand devarakonda new movie launched officially

ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. దర్శకుడు దామోదరతో చేస్తున్న ‘పుష్పక విమానం’ సినిమా నవంబర్ 12 న విడుదల కానుంది. అలానే మరో పక్క గుహన్ దర్శకత్వం వహించిన ‘హైవే’ అనే సినిమాను కూడా పూర్తి చేశాడు. అయితే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పాడు ఆనంద్.

డైరెక్టర్ సాయి రాజేష్ దర్శకత్వంలో … సాఫ్ట్ వేర్  డెవలపర్ షార్ట్ ఫిలిం లో నటించిన వైష్ణవి చైతన్య, విరాజ్ ఆశి ​​ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘బేబీ’. ఈ సినిమాకు ఎస్. కె. ఎన్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ నేపధ్యంలోనే ఈరోజు ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు సుకుమార్  పాల్గొన్నారు.

ఈ నెల 20వ తేదీ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని మూవీ యూనిట్ తెలిపారు. ‘100 పర్సెంట్ లవ్’, ‘వన్ నేనొక్కడినే’, ‘పుష్ప’ వంటి భారీ చిత్రాలకు పని చేసిన కార్తిక్ శ్రీనివాస్… ఈ చిత్రానికి ఎడిటర్ గా పనిచేస్తుండడం విశేషం. విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పూజ కార్యక్రమం ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular