Homeఎంటర్టైన్మెంట్Anaganagaa Oka Raju collections : 'అనగనగా ఒక రాజు' జోరుకు 'శంకర వరప్రసాద్' బ్రేక్...

Anaganagaa Oka Raju collections : ‘అనగనగా ఒక రాజు’ జోరుకు ‘శంకర వరప్రసాద్’ బ్రేక్ వేశారా? 19 రోజుల వసూళ్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Anaganagaa Oka Raju collections : ఈ సంక్రాంతి పోటీ లో నిలబడి సూపర్ హిట్ స్టేటస్ ని సొంతం చేసుకున్న చిత్రాల్లో ఒకటి ‘అనగనగా ఒక రాజు'(Anaganagaa Oka Raju). నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) హీరో గా నటించిన ఈ సినిమా మొదటి నుండి మంచి అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా కూడా ఉండడం తో ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ తో పాటు, మంచి లాంగ్ రన్ కూడా సొంతం అయ్యింది. ఇప్పటికీ థియేటర్స్ లో డీసెంట్ స్థాయి రన్ ని సొంతం చేసుకుంటున్న ఈ చిత్రానికి 19 వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి 42 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా 19 రోజులకు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 86.65 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 47.79 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లను ఒకసారి చూద్దాం.

నైజాం ప్రాంతం నుండి ఈ చిత్రానికి 12.34 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈమధ్య కాలం లో ఒక మీడియం రేంజ్ హీరో సినిమాకు ఈ స్థాయి షేర్ వసూళ్లు రాలేదు. అదే విధంగా సీడెడ్ ప్రాంతం నుండి 4.17 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 7.18 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. సాధారణంగా సంక్రాంతి సీజన్ లో సీడెడ్ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాల వసూళ్లు సమానంగా ఉంటాయి. కానీ ఈ చిత్రానికి ఆ పరిస్థితి రాలేదు. సీడెడ్ ప్రాంతం లో లాభాలు వచ్చినప్పటికీ, అక్కడ పెద్ద హిట్ కాదని అనుకోవచ్చు. తూర్పు గోదావరి జిల్లా నుండి 4.07 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి పశ్చిమ గోదావరి జిల్లా నుండి 2.21 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సూపర్ హిట్ సినిమాలకు భారీ వసూళ్లు నమోదు అవుతాయి.

కానీ ఎందుకో ఈ చిత్రానికి ఈ ప్రాంతాల్లో లాభాలు వచ్చినప్పటికీ భారీ వసూళ్లు నమోదు అవ్వలేదు. బహుశా ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం మేనియా ఈ సినిమాపై బలంగా పడినట్టు ఉందని సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక గుంటూరు జిల్లా నుండి 2.51 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , కృష్ణా జిల్లా నుండి 2.08 కోట్ల రూపాయిలు, నెల్లూరు జిల్లా నుండి 1.43 కోట్ల రూపాయిలు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి 36 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 61 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చాయి. అదే విడగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 3.08 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి ఓవర్సీస్ నుండి 8.72 కోట్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 47.79 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 86 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో వంద కోట్ల గ్రాస్ వసూళ్లు ఈ చిత్రానికి వసూళ్లు వస్తాయని ఆశించారు, కానీ ఆ టార్గెట్ మిస్ అయ్యింది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version