Anaganaga Oka Raju Closing Collections: ఈ సంక్రాంతి కానుకగా భారీ అంచనాల నడుమ విడుదలైన నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) ‘అనగనగా ఒక రాజు'(Anaganaga Oka Raju) చిత్రం థియేట్రికల్ రన్ దాదాపుగా పూర్తి అయ్యింది. మొదటి వారం ఈ చిత్రానికి నమోదైన వసూళ్లను చూసి వంద కోట్ల గ్రాస్ క్లబ్ లోకి ఈ చిత్రం అవలీలగా చేరిపోతుందని అంతా అనుకున్నారు. కానీ పండగ సెలవులు పూర్తి అయ్యాక ఈ సినిమా కలెక్షన్స్ భారీ డ్రాప్ అయ్యాయి. ఫలితంగా వంద కోట్ల గ్రాస్ మార్కుకి ఈ చిత్రం ఆమడదూరం లోనే ఆగిపోవాల్సి వచ్చింది. కానీ నవీన్ పోలిశెట్టి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. అంతే కాకుండా ఈ సినిమాని కొనుగోలు చేసిన ప్రతీ బయ్యర్ కేవలం మొదటి నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని పొంది లాభాలను లెక్కేసుకున్నారు. అయితే క్లోజింగ్ లో ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం పదండి.
నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి 12.50 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా సీడెడ్ ప్రాతం నుండి దాదాపుగా 4.22 కోట్ల రూపాయిల వసూళ్లు రాగా, ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 7.30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇక ఉభయ గోదావరి జిల్లాల విషయానికి వస్తే ఈస్ట్ గోదావరి నుండి 4.1 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, పశ్చిమ గోదావరి జిల్లా నుండి 2.30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కృష్ణా జిల్లా నుండి 2.15 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, గుంటూరు జిల్లా నుండి 2.60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక చివరగా ఈ చిత్రం నుండి నెల్లూరు జిల్లా నుండి 1.50 లక్షల రూపాయిల షేర్ ని ఈ చిత్రం రాబట్టింది.
ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 36.75 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు , 63 క్తోల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 3.12 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టగా, ఓవర్సీస్ నుండి అక్షరాలా 8.73 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 49 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టగా, గ్రాస్ వసూళ్లు దాదాపుగా 90 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని అంచనా. లాభాలు దాదాపుగా 21 కోట్ల రూపాయలకు పైగా వచ్చినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ లోకి ఈ నెల 11 నుండి స్ట్రీమింగ్ కానిది. అంటే రేపటి నుండే అన్నమాట.