Anaganaga Oka Raju Box Office Collection: ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి అత్యధిక వసూళ్లు వచ్చాయి, కానీ ఆ సినిమాకు కూడా బ్రేక్ ఈవెన్ అయ్యేందుకు 6 రోజుల సమయం పట్టింది. కానీ నవీన్ పోలిశెట్టి(Naveen Polishetty) హీరో గా నటించిన ‘అనగనగా ఒక రాజు'(Anaganaga Oka Raju) చిత్రానికి బ్రేక్ ఈవెన్ మార్కును అందుకోవడానికి కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే పట్టింది. ఇది సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే ‘అనగనగా ఒక రాజు’ చిత్రం గొప్ప కంటెంట్ ఉన్న సినిమా అయితే కాదు. గత రెండు సినిమాలు లాగానే, ఈ సినిమా కూడా నవీన్ పోలిశెట్టి నటన వల్లే సూపర్ హిట్ గా నిల్చింది. 28 కోట్ల రూపాయిల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో దిగిన ఈ సినిమా, నాలుగు రోజుల్లోనే ఆ మార్కుని అందుకొని, ఇప్పుడు లాభాల్లోకి అడుగుపెట్టింది. ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి 4 రోజుల్లో వచ్చిన వసూళ్లు ఎంతో చూద్దాం.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రానికి నాల్గవ రోజున 5 కోట్ల 37 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి అట. ఓవరాల్ గా నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 21 కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం నుండి 7 కోట్ల 46 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, సీడెడ్ నుండి 2 కోట్ల 44 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, ఉత్తరాంధ్ర నుండి 3 కోట్ల 86 లక్షలు, , తూర్పు గోదావరి నుండి 2 కోట్ల 33 లక్షలు, పశ్చిమ గోదావరి నుండి 1 కోటి 42 లక్షలు, గుంటూరు జిల్లా నుండి 1 కోటి 59 లక్షలు, కృష్ణా జిల్లా నుండి 1 కోటి 30 లక్షలు , నెల్లూరు జిల్లా నుండి 85 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా విషయానికి వస్తే కర్ణాటక + తమిళనాడు + నార్త్ ఇండియా కలిపి ఈ చిత్రానికి కోటి 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఓవర్సీస్ నుండి ఏకంగా 5 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 28 కోట్ల 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. 20 లక్షల రూపాయలతో లాభాల్లోకి అడుగుపెట్టిన ఈ చిత్రం, ఫుల్ రన్ లో ఏ రేంజ్ లాభాలను తెచ్చిపెడుతుందో చూడాలి. వరుస ఫ్లాప్స్ లో ఉన్న నిర్మాత నాగవంశీ కి ఈ చిత్రం ద్వారా జాక్పాట్ తగిలినట్టే అనుకోవచ్చు.
