Anaganaga : ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు లాంటి వారు గొప్ప సినిమాలను తీసి వాళ్ళకంటూ ఒక సెపరేట్ క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్నారు. అందుకే వాళ్ళను రెండు కండ్లుగా అభివర్ణిస్తూ ఉండేవారు. వాళ్లు సినిమా ఇండస్ట్రీకి అందించిన సేవలు అంతా ఇంతా కాదు. మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళ ఫ్యామిలీ నుంచి చాలామంది వారసులు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు…
ఇండస్ట్రీ లో ఎంతమంది నట వారసులు ఉన్నప్పటికి కొంతమంది మాత్రమే ఇక్కడ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడోవతరం వారసుడిగా ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న నటుడు సుమంత్ (Sumanth)…ఆయన చేసిన చాలా సినిమాలు ప్రేక్షకులను అలరించడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను కూడా తీసుకొచ్చి పెట్టాయి. ఇక ప్రస్తుతం ఆయన వెబ్ మూవీ గా చేసిన ‘అనగనగా’ (Anaganaga) మూవీ ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ను చూసిన ప్రతి ఒక్కరు భావోద్వేగానికి గురవుతున్నారనే చెప్పాలి. స్కూల్లో టీచర్స్ ఎలా ఉండాలి, పిల్లలకి ఎలా పాఠాలు బోధించాలి. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల పట్ల ఎలాంటి నైతిక బాధ్యతతో వ్యవహరించాలి. పిల్లలకు చదువు ఒకటే కాదు దాంతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా కొంతవరకు నైపుణ్యం కలిగేలా వాళ్లని ప్రోత్సహించాలి. అంతే తప్ప మిషన్ లాగా ఎప్పుడు చదవడం ఒకటే పనిగా పెట్టుకోకూడదు, కాన్సెప్ట్ ను అర్థం చేసుకొవాలి కానీ బట్టి కొట్టకూడదు అనే విషయాలను ఈ సినిమాలో క్లారిటీగా చూపించారు.
Also Read : ‘అనగనగా’ ఫుల్ మూవీ రివ్యూ…
పిల్లలను ఎలా పెంచాలి పేరెంట్స్ కి పిల్లలకు మధ్య ఎలాంటి బాండింగ్ ఉండాలి అనే విషయాలను చాలా స్పష్టంగా తెలియజేసేలా చిత్రీకరించారు. మరి ఈ సినిమాని చూసిన చాలామంది సుమంత్ గారి యాక్టింగ్ బాగుందని చెప్పడమే కాకుండా ఆయనకు నటుడిగా మరొక మెట్టు పైకి ఎదిగారు.
ఇక ఈ సినిమాతో మరోసారి మరొక మంచి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు ఈ సినిమాని చూడని పేరెంట్స్, పిల్లలు ఎవరైనా ఉంటే ఈ సినిమాని చూసి కొన్ని విషయాల్లో ఇన్స్పైర్ అవ్వాలని చాలామంది సినిమా ప్రముఖులు సైతం చెబుతుండడం విశేషం…
ఇక ప్రస్తుతం కమర్షియల్ సినిమాలు రాజ్యమేలుతున్న సందర్భంలో కాంటెంట్ బేస్డ్ సినిమాల మీద ఫోకస్ చేసి సుమంత్ ఇలాంటి ఒక మంచి సబ్జెక్టుని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి… ప్రతి ఒక్కరూ సమాజంలో పిల్లలకు పేరెంట్స్ కి మధ్య ఉన్న ఇబ్బందులను తొలగించాలని వాళ్ల సినిమాల ద్వారా తెలియజేస్తే సమాజంలో కొంతమంది అయినా మారే అవకాశాలు ఉన్నాయి…