https://oktelugu.com/

Anchor Suma: యాంకర్ సుమకు ఊహించని షాక్, ఆ పొజిషన్ అవుట్… టాప్ యాంకర్ ఎవరంటే? షాకింగ్ సర్వే!

ప్రముఖ సంస్థ ఆర్మాక్స్ తాజాగా ఓ సర్వే నిర్వహించింది. మోస్ట్ పాపులర్ నాన్ ఫిక్షనల్ పర్సనాలిటీస్ తెలుగు పై సర్వే చేసింది. కాగా ఈ లిస్ట్ లో యాంకర్ ప్రదీప్ మాచిరాజు టాప్ లో నిలిచాడు.

Written By:
  • S Reddy
  • , Updated On : February 20, 2024 / 05:53 PM IST
    Follow us on

    Anchor Suma: సుమ కనకాల తెలుగు ఇండస్ట్రీలో యాంకర్ గా చెరగని ముద్ర వేసింది. బుల్లితెరపై దాదాపు రెండు దశాబ్దాలుగా హవా సాగిస్తుంది. సుమ కామెడీ టైమింగ్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. బుల్లితెర షోల నుంచి… వెండితెర ప్రీ రిలీజ్ ఈవెంట్స్ వరకు మొదటి ఛాయిస్ సుమ కనకాల. కానీ ఇటీవల కాలంలో సుమ జోరు తగ్గుతూ వస్తుంది. ఆమెకు గతంలో ఉన్నంత క్రేజ్ ఇప్పుడు లేదు. తాజా సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

    ప్రముఖ సంస్థ ఆర్మాక్స్ తాజాగా ఓ సర్వే నిర్వహించింది. మోస్ట్ పాపులర్ నాన్ ఫిక్షనల్ పర్సనాలిటీస్ తెలుగు పై సర్వే చేసింది. కాగా ఈ లిస్ట్ లో యాంకర్ ప్రదీప్ మాచిరాజు టాప్ లో నిలిచాడు. మేల్ యాంకర్ గా ప్రదీప్ చాలా కాలంగా సత్తా చాటుతున్నాడు. సినిమాలు, ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ యూత్ లో క్రేజ్ పెంచుకుంటున్నాడు. ఆయన తర్వాత సుడిగాలి సుధీర్ రెండో స్థానం సొంతం చేసుకున్నాడు. జబర్దస్త్ వేదికగా వెలుగులోకి వచ్చిన సుధీర్ ప్రస్తుతం వెండితెర పై మెరుపులు మెరిపిస్తున్నాడు. హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.

    ఇక మూడో స్థానంలో హైపర్ ఆది నిలిచాడు. హైపర్ ఆది ఒకప్పటి జబర్దస్త్ స్టార్ కమెడియన్. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోలలో కామెడీ పంచుతున్నారు. అలాగే సినిమాల్లోనూ రాణిస్తున్నాడు. నాలుగో స్థానం యాంకర్ సుమకు దక్కింది. సుమ వంటి లెజెండరీ యాంకర్ నాలుగో ప్లేస్ లో ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇక ఐదవ స్థానంలో చమ్మక్ చంద్ర నిలవడం విశేషం. చంద్ర జబర్దస్త్ మానేసి చాలా కాలం అవుతుంది. పైగా ఇటీవల కాలంలో బుల్లితెర షోలలో కనిపించడం లేదు.

    అయినప్పటికీ టాప్ ఫైవ్ లో నిలిచాడు. సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ కామెడీ రోల్స్ చేస్తున్నాడు చంద్ర. ప్రదీప్, సుధీర్, ఆది వీళ్లంతా ఈ మధ్య కాలంలో ఫేమ్ సంపాదించి కెరీర్ పరంగా ఎదిగిన వాళ్లు. కానీ సుమ ఏళ్లుగా ఇండస్ట్రీలో పాతుకు పోయింది. ఆమెకంటూ సపరేట్ ఇమేజ్ ఉంది. ఆమెను వెనక్కి నెట్టి .. వాళ్ళు టాప్ 3లో నిలవడం గమనార్హం. ఒక విధంగా ఇది సుమకు అవమానం అనే చెప్పొచ్చు. ప్రస్తుతం సుమ… సుమ అడ్డా పేరుతో ఒక షో చేస్తుంది. ఇటీవల కొడుకు రోషన్ ని హీరోగా పరిచయం చేసింది.