Salaar: సలార్ మూవీ విడుదలకు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉంది. వరల్డ్ వైడ్ ప్రభాస్ అభిమానులు ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ నుండి వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్. సలార్ ప్రొమోషన్స్ లో ప్రభాస్ పాల్గొనడం లేదు. రాజమౌళితో ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేశారని సమాచారం. సలార్ చిత్రానికి ప్రత్యేకంగా ప్రమోషన్స్ అవసరం లేదని ప్రభాస్ భవిస్తూ ఉండవచ్చు. అయితే ఈ లోటు పూడ్చేందుకు సెకండ్ ట్రైలర్ కూడా వదిలారు. డిసెంబర్ 18న విడుదల చేసిన సలార్ సెకండ్ ట్రైలర్ అద్భుతంగా ఉంది.
ట్రైలర్ ఎంజాయ్ చేస్తున్న ఫ్యాన్స్ కి దర్శకుడు ప్రశాంత్ నీల్ భారీ షాక్ ఇచ్చాడు. వాళ్ళ అంచనాలు తలకిందులు చేశారు. సలార్ మూవీ కెజిఎఫ్ సిరీస్లో భాగమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. టీజర్లో కొన్ని పోలికలు వెతికి సలార్ ప్రశాంత్ నీల్ సినిమాటిక్ యూనివర్స్ అనుకున్నారు. దీనిపై ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇవ్వలేదు. ఆ విషయం సినిమా చూసి తెలుసుకోండి అని సస్పెన్సు లో పెట్టాడు. విడుదలకు ముందు ఈ ఉత్కంఠకు ఆయన తెరదించారు.
కెజిఎఫ్ తో సలార్ కి ఎలాంటి సంబంధం లేదని బాంబు పేల్చాడు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ నోరెళ్లబెట్టారు. అసలు సలార్ లో కెజిఎఫ్ రాఖీ భాయ్ ఎంట్రీ కూడా ఉంటుందని ఊహగానాలు చక్కర్లు కొట్టాయి. వాటన్నింటికీ చెక్ పడింది. ఇక రెండు ట్రైలర్స్ లో సలార్ మూవీ కథ కూడా చెప్పేశాడు దర్శకుడు. ఇది ఇద్దరు మిత్రుల కథ. ప్రభాస్-పృథ్విరాజ్ సుకుమారన్ ఆ మిత్రుల పాత్రలు చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ లో ప్రభాస్ మిత్రుడి కోసం యుద్ధం చేశాడు.
సలార్ పార్ట్ 2లో మిత్రుల మధ్యే యుద్ధం జరుగుతుంది. ప్రాణ మిత్రులు బద్ద శత్రువులు ఎలా అయ్యారనేది అసలు ట్విస్ట్. సలార్ వరల్డ్ వైడ్ డిసెంబర్ 22న విడుదల కానుంది. ఈ మూవీలో ప్రభాస్ కి జంటగా శృతి హాసన్ నటిస్తుంది. జగపతిబాబు, బాబీ సింహ, టిను ఆనంద్ కీలక రోల్స్ చేస్తున్నారు.