https://oktelugu.com/

Prabhas Die Hard Fan: ప్రభాస్ తో ఫొటో కోసం నిరాహరదీక్ష కి దిగిన వీరాభిమాని

Prabhas Die Hard Fan: మన టాలీవుడ్ లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కి ఎలాంటి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..అభిమానులు ఈయనని ఒక ఆరాధ్య దైవం లాగ భావిస్తారు..ఆయన కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడరు..అలాంటి డై హార్డ్ ఫాన్స్ ప్రభాస్ సొంతం..ఇది కాసేపు పక్కన సోషల్ మీడియా లో ఇటీవల ఒక్క వీరాభిమాని చేసిన పని హాట్ టాపిక్ గా మారింది..అసలు విషయానికి వస్తే ప్రభాస్ తానూ వీరాభిమానిని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 30, 2022 / 09:56 AM IST
    Follow us on

    Prabhas Die Hard Fan: మన టాలీవుడ్ లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కి ఎలాంటి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..అభిమానులు ఈయనని ఒక ఆరాధ్య దైవం లాగ భావిస్తారు..ఆయన కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడరు..అలాంటి డై హార్డ్ ఫాన్స్ ప్రభాస్ సొంతం..ఇది కాసేపు పక్కన సోషల్ మీడియా లో ఇటీవల ఒక్క వీరాభిమాని చేసిన పని హాట్ టాపిక్ గా మారింది..అసలు విషయానికి వస్తే ప్రభాస్ తానూ వీరాభిమానిని అని..ఆయన పేరిట ఎన్నో సేవ కార్యక్రమాలు చేసానని..ఇదంతా కేవలం నా అభిమాన హీరో ప్రభాస్ కోసం మాత్రమే చేసానని..కానీ తనకి కనీసం ఒక్క ఫోటో దిగడానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదని ఆరోపించారు..దాదాపుగా ఏడాది నుండి ప్రభాస్ ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతూ ఆయన ఆఫీస్ పర్సనల్ స్టాఫ్ ని ఎన్ని సార్లు కలిసి ప్రభాస్ తో ఒక్క ఫోటో ఇప్పించమని ప్రాధేయపడినా తనని ఎవ్వరు పట్టించుకోవడం లేదని ఆ అభిమాను ఆరోపించాడు..నాకు ప్రభాస్ ని కలిపించి ఒక్క ఫోటో దిగే ఛాన్స్ ఇవ్వకపోతే ఆయన ఇంటి ముందే కూర్చొని నిరాహార దీక్ష చేస్తాను అంటూ ఆ అభిమాని పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారిపోయింది.

    Prabhas

    Also Read: Vangaveeti Mohana Ranga: వంగవీటి మోహన్ రంగా ఎవరు? ఆయనకు ఎందుకంత క్రేజ్ అంటే?

    ప్రభాస్ అభిమానుల పట్ల ఎంతో కేరింగ్ గా ఉంటాడు..ఎదో పెద్ద హీరో లాగ వాళ్ళ ముందు ప్రవర్తించడు..సరదాగా నలుగురిలో ఒకడిగా కలిసిపోయాయి ‘డార్లింగ్’ అంటూ సంబోధిస్తూ ఎంతో ప్రేమని చూపిస్తాడు..కానీ ఇప్పుడు ప్రభాస్ అభిమానులకు అందుబాటులోకి లేకపోవడానికి కూడా ఒక కారణం ఉంది..ప్రభాస్ ఇప్పుడు ఏకంగా మూడు సినిమాల్లో ఒకేసారి నటిస్తున్నాడు..ఒక్కటి KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ సినిమా కాగా , మరొకటి మహానటి దర్శకుడు నాగ అశ్విన్ తో చేస్తున్న ప్రాజెక్ట్ K అనే సినిమా..ఈ రెండు సినిమాల షూటింగ్స్ ఒకేసారి జరుగుతున్నాయి..వీటితో పాటు మరోపక్క ఆదిపురుష్ షూటింగ్ కూడా జరుగుతుంది..ఇంత భారీ షెడ్యూల్స్ ఉండడం వల్లే ఆయన అభిమానులకు అందుబాటులో లేకుండా పోతున్నాడని ప్రభాస్ సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి..ప్రభాస్ తన ఇంట్లో ఉండడం కంటే ఎక్కువగా ఇతర రాష్ట్రాల్లో హోటల్స్ లో ఉండడమే ఎక్కువ అని..ఆయన బిజీ షెడ్యూల్స్ ఆ రేంజ్ లో ఉన్నాయని..కచ్చితంగా ఎదో ఒక సమయం అభిమానులకు కేటాయించి ప్రతి ఒక్కరికి ప్రభాస్ తో ఫోటో షూట్ ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు.

    Prabhas Fans

    Also Read: Delhi Husband Wife Case: భర్త మద్యం తాగేస్తున్న భార్య..చూసిన ఆ భర్త ఏం చేశాడో తెలుసా?

    Tags