హాట్ భామ అమీ జాక్సన్ తన ప్రియుడికి బ్రేకప్ చెప్పిందా ? జార్జ్ పనాయొటో అనే విదేశీయుడితో ప్రేమలో మునిగి నానిపోయి ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది. కానీ తాజాగా అతనికి బ్రేకప్ చెప్పేసిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ‘రోబో’తో అమీ జాక్సన్ కి పాన్ ఇండియా హీరోయిన్ అనే ఇమేజ్ వచ్చింది. దాంతో అమీ పెళ్లి కాకుండానే తల్లి అయిన సంగతి ఇండియా వైడ్ గా బాగా వైరల్ అయింది.
బ్రిటన్ వ్యాపారవేత్త జార్జ్ పనాయొటోతో ప్రేమ అంటే.. అమ్మడు సెటిల్ అయిపొయిందనుకున్నారు. కాకపోతే పెళ్లి చేసుకోకుండా అతనితో సహజీవనం చేయడంతో ఇప్పుడు ఏమిటి ఆమె పరిస్థితి అనేది చూడాలి. పైగా పెళ్లికి ముందే గర్భం దాల్చి 2019లో కుమారుడికి జన్మనివ్వడం కూడా అప్పట్లో అది బాగా హాట్ టాపిక్ అయింది.
దాదాపు మూడేళ్లు తన ప్రియుడితో సహజీవనం చేసి.. ఉన్నట్టు ఉండి అనూహ్యంగా అతగాడితో ఎందుకు కట్ చేసుకుంది ? ఒకవేళ అతనే అమీని దూరం పెట్టాడా ? మరి బిడ్డ పరిస్థితి ఏమిటి ? అనేది చూడాలి. అసలు అమీ జాక్సన్ జార్జ్ విడిపోవడానికి కారణం.. వారి మధ్య చోటు చేసుకున్న వ్యక్తిగత విభేదాలేనట. అతను ఆమెను బాగా వేధిస్తున్నాడట.
మొత్తానికి తన సోషల్ మీడియా ఖాతా ఇన్స్‌స్టాగ్రామ్ లో జార్జ్ పనాయొటోతో దిగిన ఫొటోలను డిలీట్ చేసేసింది అమీ. ప్రియుడు ఫొటోస్ అన్నీ డిలీట్ చేసింది కాబట్టి. ఇక ప్రియుడితో ఆమె బ్రేకప్ కన్ఫర్మ్ అయిందని తెలుస్తోంది. 2010 సంవత్సరంలో ‘మద్రాసుపట్నం’ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ఆరంభించిన అమీ జాక్సన్ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ నటించి పేరు తెచ్చుకుంది.