Amrutha : 2018 సెప్టెంబర్ 14 వ తేదీన తెలంగాణ ప్రాంతం లోని మిర్యాలగూడ లో జరిగిన ఒక పరువు హత్య ఎంతటి సంచలనం రేపిందో మన అందరికీ తెలిసిందే. అమృత(Amrutha), ప్రణయ్(Pranay) లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అమృత మంచి ఆస్తి అంతస్తులు ఉన్న ఇంటికి చెందిన అమ్మాయి. కాబట్టి ఇంట్లో పెళ్ళికి ఒప్పుకోరు అని తెలిసి, ఎవ్వరికీ చెప్పకుండా పెళ్లి చేసుకొని కాపురం పెట్టారు. వీళ్ళ కోసం అమూర్త తండ్రి అన్ని ప్రాంతాల్లోనూ గాలించారు. మిర్యాలగూడ లో ఉన్నారనే విషయం తెలుసుకొని, కొన్ని రోజులు రెక్కీ నిర్వహించి ఒక రోజు అమృత ని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో టెస్టులు నిర్వహించి ఇంటికి తీసుకెళ్తున్న సమయంలో ప్రణయ్ పై అత్యంత కిరాతకంగా దాడి చేసి ప్రాణాలు తీశారు. అప్పటి నుండి అమృత న్యాయం కోసం పోరాటం చేస్తూనే ఉంది.
Also Read : ఎట్టకేలకు ప్రణయ్ కేసు తీర్పు పై తొలిసారి స్పందించిన అమృత..
అమృత తండ్రి పై కేసు నమోదు అవ్వడం, అతన్ని సభ్య సమాజం మొత్తం అసహ్యించుకోవడం జరగడంతో అవమానం తట్టుకోలేక 2020 వ సంవత్సరం లో అఘాయిత్యం చేసుకున్నాడు. అదే విధంగా ప్రణయ్ ప్రాణాలను తీసిన వాళ్ళందరిని అరెస్ట్ చేసి, ఇన్ని రోజులు విచారణ చేపట్టారు. తీర్పు ఆలస్యం అయినప్పటికీ, సభ్య సమాజం హర్షించే తీర్పే వచ్చింది. ఈ కేసు లో A2 గా నిల్చిన వ్యక్తిని ఉరి శిక్ష విధించిన కోర్టు, మిగిలిన 5 మందికి యావర్జీవ కారాగార శిక్ష విధించింది. అమృత, ప్రణయ్ లకు ఎట్టకేలకు న్యాయం జరిగినందుకు అందరూ హర్షం వ్యక్తం చేసారు. ఇది ఇలా ఉండగా అమృత సోషల్ మీడియాలో ఎప్పటి నుండో యాక్టీవ్ గా ఉంటూ వస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఇంస్టాగ్రామ్ లో రెగ్యులర్ గా యాక్టీవ్ గా ఉండే ఈ అమ్మాయి, యూట్యూబ్ లో ఒక ఛానల్ ని క్రియేట్ చేసి గత ఐదేళ్లుగా ఎన్నో వ్లాగ్ వీడియోస్ చేస్తూ వస్తుంది.
నిన్న మొన్నటి వరకు ఈమె ఇంస్టాగ్రామ్ అకౌంట్ ‘అమృత ప్రణయ్'(Amrutha Pranay) పేరుతో ఉండేది. కానీ కోర్టు లో తీర్పు వచ్చిన తర్వాత ఆమె ‘అమృత వర్షిణి'(Amrutha Varshini) గా పేరు మార్చుకుంది. అకస్మాత్తుగా ఇలా ఎందుకు పేరు మార్చుకుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. పేరు మార్చుకున్న వెంటనే ఆమె ‘రెస్ట్ ఇన్ పీస్’ అంటూ ఒక స్టోరీ ని అప్లోడ్ చేసింది. ప్రణయ్ ఆత్మకు శాంతి చేకూరింది కాబట్టి, ఇక నుండి ఆమె కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనే ఉద్దేశ్యంతోనే ఇలా చేసిందా?, త్వరలోనే మరో పెళ్లి చేసుకోబోతుందా?, అసలు పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి అమృత మాత్రమే సమాధానం చెప్పగలడు. సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉండే ఆమె, దీనిపై రెస్పాన్స్ ఇస్తుందో లేదో చూడాలి.
Also Read : అంతా అమృతనే చేసింది.. మా నాన్నకు ఎందుకీ శిక్ష? విలపించిన కూతురు
