https://oktelugu.com/

Amrutha Pranay: బిగ్ బాస్ హౌస్లోకి అమృత ప్రణయ్, కళ్ళ ముందే భర్త మరణాన్ని చూసిన ఈ అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలుసా?

అమృత బిగ్ బాస్ హౌస్ కి వస్తున్నారన్న న్యూస్ కాకరేపుతుంది. అమృత కంటెస్టెంట్ గా రావడం షోకి కలిసి వస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. అమృత ప్రణయ్ ఇప్పుడు ఏం చేస్తున్నారో చాలా మందికి తెలియదు. ఆమె మీడియా ముందుకు వచ్చి కూడా చాలా కాలం అవుతుంది. అమృత ప్రణయ్ నిజ జీవితంలో ఎలా ఉంటారో బిగ్ బాస్ షో ద్వారా తెలుస్తుంది అనడంలో సందేహం లేదు.

Written By:
  • S Reddy
  • , Updated On : July 25, 2024 / 10:21 AM IST

    Amrutha Pranay

    Follow us on

    Amrutha Pranay: బిగ్ బాస్ తెలుగు 8 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. హోస్ట్ నాగార్జున ప్రోమో కూడా విడుదల చేశారు. బిగ్ బాస్ తెలుగు 8 లోగో అదిరింది. చాలా కలర్ఫుల్ గా ఉంది. లోగో ఆసక్తి రేపేలా ఉంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లోగోలో కొన్ని డిటైల్స్ ఉన్నాయని రివ్యూవర్స్ అంచనా వేస్తున్నారు. ఈసారి బిగ్ బాస్ షోలో రెండు హౌసులు ఉంటాయని అంటున్నారు. కాగా సెప్టెంబర్ మొదటివారంలో షో మొదలయ్యే సూచనలు ఉన్నాయి.

    Also Read: పుష్ప 2 లో క్యామియో రోల్స్ ప్లే చేస్తున్న స్టార్ హీరోలు వీళ్లేనా..?

    ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారం అవుతున్న కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సెప్టెంబర్ 1తో ముగుస్తుందట. సెప్టెంబర్ 8 నుండి బిగ్ బాస్ తెలుగు 8 ప్రసారం అవుతుందట. ఈసారి బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టే కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్ అయ్యింది. ఖయ్యుమ్ అలీ, రేఖా భోజ్, రీతూ చౌదరి, మై విలేజ్ షో అనిల్, యాదమ్మ రాజు, సోనియా సింగ్, ప్రభాస్ శ్రీను, బంచిక్ బబ్లూ తో పాటు మరికొందరు ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి.

    అనూహ్యంగా అమృత ప్రణయ్ పేరు తెరపైకి వచ్చింది. అమృత ప్రణయ్ ఎవరు అనేది చాలా మందికి తెలియదు. కానీ ఒకప్పుడు సంచలనం రేపిన పేరు ఇది. అమృత కళ్ళముందే ఆమె భర్త ప్రణయ్ ని హత్య చేశారు. అమృత తండ్రి మారుతీరావు ఈ హత్య చేయించాడు. మిర్యాలగూడకు చెందిన అమృత-ప్రణయ్ స్కూల్ డేస్ నుండి లవ్ లో ఉన్నారు. పెద్దయ్యాక ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.

    ఇద్దరివీ వేర్వేరు సామాజిక వర్గాలు. అమృత అగ్రవర్ణాలకు చెందిన అమ్మాయి కాగా, ప్రణయ్ దళితుడు. అమృత తండ్రి మారుతిరావు ఆర్థికంగా బలమైన వ్యక్తి. ఊరిలో పలుకుబడి ఉన్నవాడు. తన కూతురు అమృత ఒక దళితుడిని వివాహం చేసుకోవడం ఆయన జీర్ణించుకోలేకపోయాడు. గర్భం దాల్చిన అమృతను మెడికల్ చెకప్ కోసం ఆసుపత్రికి ప్రణయ్ తీసుకొచ్చాడు. పరీక్షల అనంతరం తిరిగి ఇంటికి వెళుతుండగా… అక్కడే కాచుకుని కూర్చున్న వ్యక్తి… వెనుకగా వెళ్లి ప్రణయ్ మీద కత్తితో దాడి చేసి పారిపోయాడు.

    షాక్ కి గురైన అమృత ఆసుపత్రి లోపలి పరుగెత్తి సహాయం కోసం ప్రయత్నం చేసింది. ప్రణయ్ కి మెడపై గాయం కావడంతో మరణించాడు. రూ. 10 లక్షలకు కాంట్రాక్ట్ కిల్లర్ ని మారుతి రావు సెట్ చేశాడని విచారణలో తెలిసింది. మారుతిరావుతో పాటు హత్యతో సంబంధం ఉన్నవారిని అరెస్ట్ చేశారు పోలీసులు. 2018లో ప్రణయ్ ని హత్య చేశారు. తండ్రి మీద అమృత న్యాయపోరాటం చేసింది.

    జైలు నుండి బెయిల్ పై వచ్చిన మారుతీరావు 2020లో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. అమృత జీవితం ఆధారంగా రామ్ గోపాల్ వర్మ మర్డర్ పేరుతో ఒక సినిమా తీయడం విశేషం. ఈ మూవీని అమృత తీవ్రంగా వ్యతిరేకించింది. మర్డర్ సినిమాకు వ్యతిరేకంగా ఆమె కోర్టులో పిటిషన్ వేసింది. అమృత ప్రస్తుతం తన కొడుకుతో పాటు అత్తమామల వద్దే ఉంటుంది.

    కాగా అమృత బిగ్ బాస్ హౌస్ కి వస్తున్నారన్న న్యూస్ కాకరేపుతుంది. అమృత కంటెస్టెంట్ గా రావడం షోకి కలిసి వస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. అమృత ప్రణయ్ ఇప్పుడు ఏం చేస్తున్నారో చాలా మందికి తెలియదు. ఆమె మీడియా ముందుకు వచ్చి కూడా చాలా కాలం అవుతుంది. అమృత ప్రణయ్ నిజ జీవితంలో ఎలా ఉంటారో బిగ్ బాస్ షో ద్వారా తెలుస్తుంది అనడంలో సందేహం లేదు.

    Also Read: ఆ హీరోయిన్ తో సాయిధరమ్ తేజ్ లవ్ మ్యారేజ్.. మెగా ఇంట్లో మరో పెళ్లి.. అసలు క్లారిటీ వచ్చేసిందిగా!