https://oktelugu.com/

తెలుగులో అమృత అయ్యర్ కి రెండు

ఒక సినిమా సూపర్ హిట్ అయితే ఆ సినిమాలో నటించిన వారందరికీ ఏదో రకమైన గుర్తింపు వస్తుంది. ఇతర చిత్రాల్లో అవకాశాలు బాగానే వస్తాయి. అలా ఒక తమిళ అమ్మాయికి తెలుగు సినిమాల్లో అవకాశాలు వెతుక్కొంటూ వస్తున్నాయి. తమిళ్ స్టార్ హీరో విజయ్ గత ఏడాది బిగిల్ అనే బ్లాక్ బస్టర్ హిట్ సినిమా చేసాడు. తెలుగులో ఈ చిత్రం విజిల్ పేరుతో విడుదలయ్యింది.ఇక్కడ కూడా బాగానే ఆడింది. ఇక ఈ మూవీలో లేడీ ఫుట్ బాల్ […]

Written By: , Updated On : March 11, 2020 / 03:43 PM IST
Follow us on

ఒక సినిమా సూపర్ హిట్ అయితే ఆ సినిమాలో నటించిన వారందరికీ ఏదో రకమైన గుర్తింపు వస్తుంది. ఇతర చిత్రాల్లో అవకాశాలు బాగానే వస్తాయి. అలా ఒక తమిళ అమ్మాయికి తెలుగు సినిమాల్లో అవకాశాలు వెతుక్కొంటూ వస్తున్నాయి.

తమిళ్ స్టార్ హీరో విజయ్ గత ఏడాది బిగిల్ అనే బ్లాక్ బస్టర్ హిట్ సినిమా చేసాడు. తెలుగులో ఈ చిత్రం విజిల్ పేరుతో విడుదలయ్యింది.ఇక్కడ కూడా బాగానే ఆడింది. ఇక ఈ మూవీలో లేడీ ఫుట్ బాల్ ప్లేయర్స్ గా నటించిన అమ్మాయిలలో కొందరు హీరోయిన్స్ గా ఇతర భాషల చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. వారిలో అమృత అయ్యర్ ఒకరు. అమృత అయ్యర్ ఇప్పటికే యాంకర్ ప్రదీప్ హీరోగా పరిచయమవుతున్న 30రోజుల్లో ప్రేమించడం ఎలా? చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.

ఇటీవల నాగ శౌర్య హీరోగా ఓ నూతన చిత్రం ప్రారంభమైంది. నిర్మాత మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు రాజా కొలుసు దర్శకత్వం వహించ బోతున్నాడు.. యాక్షన్ అండ్ రొమాంటిక్ డ్రామాగా రానున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా అమృత అయ్యర్ ని తీసుకున్నారు. త్వరలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది
Ability is off little without an opportunity