Amrita Rao Marriage: నా పెళ్లి ఖర్చు కేవలం ఒకటిన్నర లక్ష… షాకింగ్ సీక్రెట్ రివీల్ చేసిన మహేష్ హీరోయిన్

అమృతా రావు మాట్లాడుతూ.. పెళ్లి అనేది ప్రేమకు సంబంధించిన విషయం. మన హోదా, అంతస్తులు చూపించే వేదిక కాదు. అందుకే మా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి ముగించాము అన్నారు.

Written By: Shiva, Updated On : May 15, 2023 6:18 pm

Amrita Rao Marriage

Follow us on

Amrita Rao Marriage: మహేష్ హీరోయిన్ అమృతా రావ్ తన పెళ్లి గురించి షాకింగ్ విషయాలు వెల్లడించారు. ప్రియుడు అన్మోల్ సూద్ తో తన వివాహం ఎంత నిరాడంబరంగా జరిగిందో చెప్పారు. పెళ్లి అంటే జీవితంలో ఒకేసారి జరిగే అతిపెద్ద వేడుక. అందుకే ప్రతి విషయం చాలా ప్రత్యేకంగా ఉండాలని వరుడు, వధువు, వారి కుటుంబ సభ్యులు కోరుకుంటారు. పెళ్లి బట్టలు, ఏర్పాట్లు, అలంకరణలు, వేడుకలు, విందు, వినోదం.. ఇలా ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకుంటారు. అయినవారు, సన్నిహితులకు తమ హోదా తెలిసేలా ప్లాన్ చేస్తారు. ఎక్కడా తగ్గకూడదని లక్షలు ఖర్చు చేస్తారు. సెలెబ్రిటీలు మరింత పర్టిక్యులర్ గా ఉంటారు.

అయితే హీరోయిన్ అమృతా రావు మాత్రం కేవలం తన పెళ్లికి రూ.1.5 లక్షలు ఖర్చు చేసిందట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం అట. ఈ మొత్తం వధువు ధరించే ఇక డిజైనర్ వేర్ ధర కంటే తక్కువ. ఈ లక్షన్నరలోనే వధూవరులు పెళ్లి తంతు ముగించారట. తొమ్మిదేళ్ల క్రితం పూణేలో గల ఇస్కాన్ టెంపుల్ లో అమృత రావు, అన్మోల్ రహస్యంగా వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ పెళ్ళికి డిజైనర్ వేర్ ధరించేందుకు ఇష్టపడలేదట. పెళ్లి బట్టల కోసం చెరో రూ. 3000 ఖర్చు చేశారట. వేదిక ఏర్పాటు, విందుకు రూ. 11000 వేలు ఖర్చు అయ్యిందట.

అమృతా రావు మాట్లాడుతూ.. పెళ్లి అనేది ప్రేమకు సంబంధించిన విషయం. మన హోదా, అంతస్తులు చూపించే వేదిక కాదు. అందుకే మా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి ముగించాము అన్నారు. అన్మోల్ మాట్లాడుతూ… ఈ వివాహం మా ఇద్దరి మనస్తత్వాలను తెలియజేస్తుంది. మేము ఆడంబరాలు కోరుకోము అన్నారు. కేవలం లక్షన్నర ఖర్చుతో పెళ్లి ముగించిన ఈ జంట గురించి బాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తుంది.

అమృతా రావు 2002లో విడుదలైన అబ్ కే బారాస్ మూవీతో వెండితెరకు పరిచయమయ్యారు. ఈమె తెలుగులో చేసిన ఒకే ఒక చిత్రం అతిథి. మహేష్ బాబు హీరోగా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. మోస్ట్ స్టైలిష్ మూవీగా పేరు తెచ్చుకున్న ఈ చిత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేదు. మహేష్ లుక్, మేనరిజమ్స్ ఆకట్టుకున్నాయి. ఆ చిత్రం తర్వాత అమృతా రావు మరలా తెలుగులో కనిపించలేదు. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు. 2019లో విడుదలైన థాకరే చిత్రం అనంతరం ఆమె నటించలేదు.