Chandrababu – Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ ను అందుకే దువ్వుతున్న చంద్రబాబు

అది రాజకీయ రచ్చకు దారితీసే అవకాశం ఉంది. ఒక వేళ తారక్ హాజరైతే మాత్రం వెనువెంటనే మహానాడుకు తీసుకెళ్లాలని టీడీపీ నాయకులు ప్లాన్ చస్తున్నట్టు సమాచారం. అయితే దీనిపై జూనియర్ ఎన్టీఆర్ ఎలా రియాక్టవుతారో చూడాలి మరీ..

Written By: Dharma, Updated On : May 15, 2023 6:01 pm
Follow us on

Chandrababu – Jr NTR : నందమూరి  కుటుంబాన్ని బుట్టలో వేసుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయి.. ఖాళీ చేతులతో కాంగ్రెస్ నుంచి ఎన్టీఆర్ చెంతకు చేరారు చంద్రబాబు. వచ్చిరాగానే టీడీపీలో పవర్ సెంటర్ గా మారిపోయారు. పార్టీని తన కనసున్నల్లో తీసుకున్నారు. నందమూరి కుటుంబాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకున్నారు. లక్ష్మీపార్వతిని అడ్డంపెట్టుకొని ఏకంగా వారితోనే తిరుగుబాటు చేయించారు. పార్టీని, ప్రభుత్వాన్ని టేకోవర్ చేసుకున్నారు. ఈ క్రమంలో తనకు కష్టం ఎదురైన ప్రతిసారి ఎన్టీఆర్ బొమ్మను, నందమూరి కుటుంబాన్ని వాడుకోవడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. హరిక్రిష్ణ, బాలక్రిష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ను అన్నివిధాలా వాడేసుకున్నారు. బాలక్రిష్ణను వియ్యంకుడిగా చేసుకొని గుప్పెట్లో పెట్టుకున్నారు. అటు నందమూరి వంశంలో మూడో తరంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణరామ్, తారకరత్న, సుహాసిని ఇలా అందర్నీ వాడేసుకున్నారు. వాడకం ఎలా ఉంటుందో  చేసి చూపించారు. అయితే ఎక్కడ లెక్క తప్పిందో తెలియదు కానీ గత కొద్దికాలంగా జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుకు చిక్కడం లేదన్న టాక్ ఉంది.

టీడీపీలో కలకలం
అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో జూనియర్ ను  దువ్వే పనిలో చంద్రబాబు ఉన్నారని ప్రచారం నడుస్తోంది. అందుకు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు, మహానాడు కార్యక్రమాలను వినియోగించుకోవాలని చూస్తున్నారు. మొన్నటికి మొన్న బీఆర్ఎస్ మంత్రి పువ్వాడ అజయ్ జూనియర్ ఎన్టీఆర్ ను కలిశారు. ఖమ్మంలో ఏర్పాటుచేసి 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు హాజరుకావాలని కోరారు. అంతకు ముందే విజయవాడ నడిబొడ్డున జరిగిన ఎన్టీఆర్ జయంతి వేడుకలకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. జూనియర్ కు ఆహ్వానం లేకపోవడం వల్లే ఆయన హాజరుకాలేదని టాక్ నడిచింది. నందమూరి అభిమానులు సైతం హర్ట్ అయ్యారు. ఈ పరిణామాలతో తెలుగుదేశం లో కూడా కలవరం రేగింది. దాని కంటే ముందు ఉమ్మడి క్రిష్ణా జిల్లా టూర్ కి చంద్రబాబు వెళ్లినపుడు కూడా జూనియర్ ఫ్యాన్స్ సీఎం జూనియర్ అంటూ గొడవ చేశారు. ప్ల కార్డులు ప్రదర్శించారు. వారిని సభ నుంచి బయటకు పంపించేశారు

ఇన్విటేషన్ అందించిన వైనం..
అయితే జూనియర్ ఎన్టీఆర్ విషయంలో జరుగుతున్న ప్రచారానికి తెరదించాలనో.. లేకుంటే టీడీపీ శ్రేణులకు క్లారిటీ ఇవ్వాలన్న ఉద్దేశ్యమో తెలియదు కానీ.. జూనియర్ ఎన్టీఆర్ కు టీడీపీ ప్రత్యేక ఆహ్వానం పంపింది.  ఎన్టీఆర్  శత జయంతి ఉత్సవాల ఇన్విటేషన్ అందించింది. ఈ నెల 20వ తేదీన హైదరాబాద్ లో జరిగే  ఎన్టీయార్   శత జయంతి ఉత్సవాలకు హాజరు కావాలని ఉసవ కమిటీ చైర్మన్ హోదాలో టీడీ జనార్ధన్, ఎన్టీఆర్ చిన్న కుమారుడు నందమూరి రామక్రిష్ణ ఈ ఇన్విటేషన్ అందించారు. అయితే దీనిపై నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు ఖుషీ అవుతున్నారు. కానీ జూనియర్ వస్తాడా? రాడా? అన్నదానిపై చర్చ ప్రారంభమైంది.

ఒకే వేదికపై రెండు కుటుంబాలు..
శతజయంతి వేడుకలకు అటు నందమూరి, ఇటు నారా కుటుంబాలకు ప్రత్యేక ఆహ్వానం అందిస్తున్నారు. దీంతో అందరూ ఒకే వేదికపైకి వచ్చే అవకాశముంది. ఇప్పటికే తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబంతో చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఒక్క జూనియర్ ఎన్టీఆర్ తప్ప మిగతా నందమూరి కుటుంబసభ్యులు సైతం చంద్రబాబుతో సన్నిహితంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ వస్తాడా? లేడా అన్నదే ఇక్కడ అసలైన పాయింట్. చంద్రబాబు తో కలసి వేదిక పంచుకోవడానికి జూనియర్ కి సమ్మతమేనా అన్న చర్చ వస్తోంది. తన తాత గారి శత జయంతి అని భావించి జూనియర్ వచ్చినా  అది రాజకీయ రచ్చకు దారితీసే అవకాశం ఉంది. ఒక వేళ తారక్ హాజరైతే మాత్రం వెనువెంటనే మహానాడుకు తీసుకెళ్లాలని టీడీపీ నాయకులు ప్లాన్ చస్తున్నట్టు సమాచారం. అయితే దీనిపై జూనియర్ ఎన్టీఆర్ ఎలా రియాక్టవుతారో చూడాలి మరీ..