Chiranjeevi
Chiranjeevi: స్టూడెంట్ నెంబర్ వన్ (Student Number One)సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు రాజమౌళి(Rajamouli)…ఆయన చేసిన ప్రతి సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించడమే కాకుండా మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాలు సగటు ప్రేక్షకులను మెప్పించడానికి ఆయన చాలావరకు కేర్ తీసుకొని మరి సినిమాను చేస్తూ ఉంటారు. అందువల్లే ఆయన సినిమాకు బీ,సీ సెంటర్లో విపరీతమైన ఆదరణ అయితే దక్కుతుంది. వాళ్లు రిపీటెడ్ గా సినిమాను చూసి సినిమాను బ్లాక్ బస్టర్ గా నిలుపుతారు. ఇక రాజమౌళి సినిమాలు ఎలా తీస్తాడు అనేది మనందరికీ తెలిసిందే. ఆయన చేసిన 12 సినిమాల్లో 12 సినిమాలు కూడా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి(Chirnajeevi) తో కూడా ఆయన ఒక సినిమా చేయాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల సినిమా పట్టాలెక్కలేదు.
ఇక ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవికి రాజమౌళి చేసిన సినిమాల్లో ఒక మర్యాద రామన్న (Maryada Ramanna) సినిమాని మినహాయిస్తే మిగిలిన అన్ని సినిమాలు ఉంటే అతనికి చాలా ఇష్టమట. ఎందుకంటే మర్యాద రామన్న సినిమా రాజమౌళి స్టాండెడ్ సినిమా కాదని రాజమౌళి తన పంథాను మార్చుకొని ఒక కామెడీ సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో మాత్రమే ఆ సినిమాను చేశారని చెబుతున్నాడు.
నిజానికి రాజమౌళి స్టాండర్డ్ సినిమా అయితే అది కాదు. కానీ ఒక పెద్ద సినిమా చేసి దాని తర్వాత మరొక పెద్ద సినిమా చేస్తే ప్రేక్షకుల్లో ఆ సినిమాకి ఈ సినిమాకి మధ్య పోలికలు ఉంటాయన్న ఉద్దేశ్యంతో మధ్యలో మర్యాద రామన్న అనే ఒక చిన్న సినిమాను చేశాడు. నిజానికి మగధీర సినిమా చేసిన వెంటనే బాహుబలి ప్రాజెక్ట్ మొదలు పెట్టాల్సింది.
కానీ మధ్యలో మర్యాద రామన్న ఈగ లాంటి రెండు సినిమాలను చేసి ఆ తర్వాత బాహుబలి ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించాడు. మొత్తానికైతే రాజమౌళి చేసిన అన్ని సినిమాలు మంచి విజయాలను సాధించడంతో ప్రస్తుతం ఆయన ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా నిలిచారనే చెప్పాలి. నిజానికి రాజమౌళి సినిమాలను చేయడమే కాదు దాన్ని జనాల్లోకి ఎలా తీసుకెళ్లాలి సినిమా మీద పబ్లిసిటీ ఎలా క్రియేట్ చేయాలి అనే ధోరణిలో కూడా ప్రమోషన్స్ ని బాగా చేస్తూ సినిమా మీద హైప్ ని క్రియేట్ చేస్తూ ఉంటాడు…