https://oktelugu.com/

Aishwarya Rai : కోడలుగా ఐశ్వర్యరాయ్ ను అమితాబ్ ఒప్పుకోలేదా? జయా బచ్చన్ కామెంట్స్ వైరల్..

తాజాగా అమితాబ్ బచ్చన్ సతీమణి జయా బచ్చన్ కాపీ విత్ కరణ్ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె అమితాబ్ గురించి హాట్ కామెంట్స్ చేశారు. ఐశ్వర్య రాయ్ ని అమితాబ్ బచ్చన్ ఎన్నడూ కోడలిగా చూడలేదని, కూతురుగా మాత్రమే చూశారని అన్నారు. మాకు కూతురు లేని లోటును ఐశ్వర్య తీర్చారని అన్నారు. అయితే వారు విడపోతున్న విషయంపై మాత్రం జయా బచ్చన్ క్లారిటీ ఇవ్వలేదు

Written By:
  • Srinivas
  • , Updated On : August 5, 2024 / 11:59 AM IST
    Follow us on

    Aishwarya Rai : సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరి పెళ్లిళ్లు గందరగోళంగా మారడాన్ని అనాధిగా చూస్తే వస్తున్నారు ప్రేక్షకులు. చిత్ర పరిశ్రమకు చెందిన కపుల్స్ ప్రేమించి పెళ్లి చేసుకుంటే.. ఆ వెంటనే విడాకుల వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకు ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి కలిసి ఉండలేక విడాకులు తీసుకునేవారు. ఆ తరువాత ఏడాది తిరగకముందే దూరమవుతున్నారు. ఇప్పుడు రోజుల వ్యవధిలోనే విడిపోతున్నారు. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన బిగ్ బి అమితాబ్ బచ్చన్ గురించి తెలియని సినీ ప్రేక్షకుడు ఉండరు. నాటి తరం నుంచి నేటి వరకు సినీ ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు అమితాబ్ బచ్చన్. ఈ సీనియర్ హీరో ఇప్పటికీ కొన్ని సినిమాల్లో నటిస్తూ అలరిస్తున్నాడు. రీసెంట్ గా కల్కి సినిమాలో మెయిన్ రోల్ లో నటించారు. అయితే అమితాబ్ బచ్చన్ సినిమాల్లో నటిస్తూనే వివిధ యాడ్స్ లో కనిపిస్తున్నారు. అలాగే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లో కనిపించి ఆకట్టుకుంటున్నారు. దశాబ్ద కాలంలో సినీ ఇండస్ట్రీలో ఉంటున్న అమితాబ్ బచ్చన్ ఎన్నడూ వివాదాల జోలికి పోలేదు. కానీ ఆయన గురించి ఇటీవల తీవ్ర చర్చ సాగుతోంది. ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య ల విడాకుల పై కొన్ని నెలలుగా చర్చలు సాగుతున్నాయి. తరుణంలో తాజాగా అమితాబ్ గురించి ఆయన సతీమణి జయాబచ్చన చేసిన కామెంట్స్ పై ఆసక్తికర చర్చ సాగుతోంది. అసలు జయాబచ్చన్ ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటీ? ఆ వివరాల్లోకి వెళ్దాం..

    అందాల రాశి ఎవరని అడిగితే ముందుగా గుర్తుకు వచ్చేపేరే ఐశ్వర్య రాయ్. భారతీయ సినీ ఇండస్ట్రీలో అందం విషయంలో ఐశ్వర్య తరువాతనే ఎవరైనా.. అని కొందరు కొనియాడుతుంటారు. ఐశ్వర్య రాయ్ సిని ఇండస్ట్రీలో కొనసాగుతునన క్రమంలోనే అమితాబ్ బచ్చన్ ఇంట్లోకి కోడలుగా అడుగుపెట్టింది. అంటే అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ లు 2007 ఏప్రిల్ 20న పెళ్ల చేసుకున్నారు. వీరి వివాహ కార్యక్రమానికి సినీ ప్రముఖులతో పాటు పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. ఆ తరువాత వీరికి ఆరాధ్య అనే కూతురు ఉంది. అప్పటి నుంచి గత ఏడాది వరకు వీరి జంట గురించి ఎలాంటి చర్చ సాగలేదు. కానీ ఏడాది కాలంగా వీరి విడాకులపై తీవ్రంగా చర్చ సాగుతోంది.

    సినీ ఇండస్ట్రీలో ఉన్నవారిపై ఇలాంటి కామెంట్లు సాధారణంగానే వస్తుంటాయి. దీంతో కొందరు క్లారిటీ ఇస్తారు. మరికొందరు మౌనంగా ఉండడంతో పాటు వారి ప్రవర్తనను బట్టి వారు కలిసున్నారా? లేదా? అనేది అర్థమవుతుంది. కానీ ఓ వైపు వీరు విడిపోతున్నారని అనుకుంటున్న తరుణంలో ఇటీవల ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ వివాహ కార్యక్రమం ద్వారా మరోసారి హాట్ టాపిక్ అయింది. ఈ వివాహ కార్యక్రమానికి ఐశ్వర్యతో పాటు అభిషేక్ కూడా హాజరయ్యారు. అయితే ఐశ్వర్య తన కూతురుతో మాత్రమే కలిసి ఫొటో దిగారు. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ విడిగా హాజరయ్యారు. దీంతో వీరు విడపోతున్నారన్న వ్యాఖ్యలకు ఆజ్యం పోసినట్లయింది.

    ఇక తాజాగా అమితాబ్ బచ్చన్ సతీమణి జయా బచ్చన్ కాపీ విత్ కరణ్ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె అమితాబ్ గురించి హాట్ కామెంట్స్ చేశారు. ఐశ్వర్య రాయ్ ని అమితాబ్ బచ్చన్ ఎన్నడూ కోడలిగా చూడలేదని, కూతురుగా మాత్రమే చూశారని అన్నారు. మాకు కూతురు లేని లోటును ఐశ్వర్య తీర్చారని అన్నారు. అయితే వారు విడపోతున్న విషయంపై మాత్రం జయా బచ్చన్ క్లారిటీ ఇవ్వలేదు. కానీ అమితాబ్ పై జయా బచ్చన్ చేసిన కామెంట్స్ మరో రకంగా వైరల్ అవుతున్నాయి.