Amitabh Bachchan- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ #OG. పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని గా చెప్పుకునే సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితమే షూటింగ్ కార్యక్రమాలను ప్రారంభించుకున్న ఈ చిత్రం ఇప్పటికీ గ్యాప్ లేకుండా హైదరాబాద్ పరిసరాల్లో జరుగుతూనే ఉంది. ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ క్రేజీ హీరో ఇమ్రాన్ హష్మీ నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
ప్రస్తుతం ఆయన మీద కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నిన్నమొన్నటి వరకు పవన్ కళ్యాణ్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొన్నాడు, ఆ తర్వాత ఆయన ‘వారాహి విజయయాత్ర’ లో బిజీ అవ్వడం తో సినిమాలో ఆయనతో సంబంధం లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాలు జులై వరకు కొనసాగుతుందట, ఆ తర్వాత ఆగష్టు నెలలో పవన్ కళ్యాణ్ ఒక 15 రోజులు డేట్స్ కేటాయిస్తే సినిమా పూర్తి అయిపోతుందని అంటున్నారు.
ఇకపోతే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి తండ్రి పాత్ర ఉంటుందట, ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని సమాచారం. ఈ పాత్రకి బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ని అడుగుతున్నారట. ప్రస్తుతం ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారని, ఆయన ఒప్పుకున్నాడా, లేదా అనేది త్వరలోనే తెలియనుంది .ఇక ఈ సినిమా పవన్ కళ్యాణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడట, ఒక పాత్ర పేరు గాంధీ కాగా, మరో పాత్ర పేరు ఓజాస్ గంభీర అలియాస్ #OG.
ఇది వరకు పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో డ్యూయల్ రోల్ ఎప్పుడూ చెయ్యలేదు. మొట్టమొదటిసారి ఆయన ఇలా డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. ఇక ఆయన అన్నయ్య గా కిక్ శ్యామ్ నటిస్తుండగా, వదినగా శ్రియా రెడ్డి నటిస్తుంది. ఇలా క్రేజీ క్యాస్టింగ్ తో ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 22 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.