Allu Arjun and Amita Bachchan : సినిమా ఇండస్ట్రీలో కొంతమందికి చాలా మంచి గుర్తింపు ఉంటుంది. వాళ్ళు చేసే ప్రతి సినిమా ప్రేక్షకులందరికి నచ్చడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కూడా పెను సంచలనాలను క్రియేట్ చేస్తూ ఉంటాయి. అందులో బిగ్ బీ అమితాబచ్చన్ ఒకరు. ఒకప్పుడు ఆయన చేసిన సినిమాలు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేశాయనే చెప్పాలి. అలాంటి నటుడు ఇప్పుడు చేస్తున్న సినిమాలు భారీ విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…
బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన నట విశ్వరూపాన్ని చూపిస్తూ యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరినీ మెప్పించిన నటుడు అమితాబచ్చన్… ఎలాంటి క్యారెక్టర్ లో అయినా అలవోకగా నటించి మెప్పించగలిగే కెపాసిటీ ఉన్న ఈ నటుడు ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా బిగ్ బి లాంటి భారీ ఇమేజ్ ను సంపాదించుకున్న అమితాబచ్చన్ భారీ రేంజ్ లో సినిమాలను చేయడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నాడు… ఇక ఈ ఏజ్ లో కూడా మంచి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం… రీసెంట్ గా ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమాలో అశ్వద్ధామ క్యారెక్టర్ లో నటించి మెప్పించి ప్రేక్షకులందరిని ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు కౌన్ బానే గా కరోడ్ పతి 16 వ సీజన్ కు కూడా ఆయనే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంలో ఆయన ఒక గృహిణి నీ ఒక ప్రశ్న అడుగుతుండగా ఆమె నాకు మీరు అల్లు అర్జున్ గారు అంటే చాలా ఇష్టమని చెప్పింది.
దాంతో అమితాబచ్చన్ అల్లు అర్జున్ నటనతో ఇప్పుడిప్పుడే పైకి ఎదుగుతున్నాడు. పాన్ ఇండియాలో తన హవాని కొనసాగిస్తున్నాడు. ముఖ్యంగా పుష్ప 2 సినిమాతో యావత్ ఇండియా ప్రేక్షకులందరిని అలరిస్తున్నాడు. అలాంటి అమితాబచ్చన్ తన స్వశక్తితో ఎదుగుతున్నాడు. అలాంటి వ్యక్తితో నన్ను పోల్చొద్దు. ఆయనకు నేను వీరాభిమాని అంటూ చెప్పాడు.
ఇక మొత్తానికైతే అల్లు అర్జున్ తన ఫేవరెట్ హీరో అని అమితాబచ్చన్ చెప్పకనే చెప్పాడు. ఇక ఏది ఏమైనా కూడా అమితాబచ్చన్ లాంటి ఒక గొప్ప వ్యక్తి నుంచి అల్లు అర్జున్ ప్రశంసలను అందుకోవడం మామూలు విషయం కాదు. మరి ఇలాంటి సందర్భంలో అల్లు అర్జున్ ప్రస్తుతం కొంతవరకు కేసు విషయంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికి ఇప్పుడిప్పుడే ఆ కేసుకు సంబంధించిన విషయాలు ఒక కొలిక్కి వస్తున్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా తన తదుపరి సినిమా విషయంలో తను చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఆయన పుష్ప 2 సినిమాతో భారీ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని ఆకట్టుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…