KGF 2 కి డిజిటల్ మార్కెట్ లో ఫుల్ డిమాండ్

బాహుబలి చిత్రం తర్వాత దక్షిణాది సినిమాలకు పాన్ ఇండియా లెవెల్ లో బిజినెస్ బాగా పెరిగింది. ఆ క్రమంలోనే వచ్చిన ` K G F` చిత్రం దక్షిణాది చిత్రాల క్రేజ్ మరింత పెంచింది. దరిమిలా ఇపుడు రాబోయే ‘K G F 2’ చిత్రం ఫై భారీ అంచనాలున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సంజయ్ దత్, రవీనాటాండన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ […]

Written By: admin, Updated On : May 8, 2020 12:44 pm
Follow us on


బాహుబలి చిత్రం తర్వాత దక్షిణాది సినిమాలకు పాన్ ఇండియా లెవెల్ లో బిజినెస్ బాగా పెరిగింది. ఆ క్రమంలోనే వచ్చిన ` K G F` చిత్రం దక్షిణాది చిత్రాల క్రేజ్ మరింత పెంచింది. దరిమిలా ఇపుడు రాబోయే ‘K G F 2’ చిత్రం ఫై భారీ అంచనాలున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సంజయ్ దత్, రవీనాటాండన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమాని అన్ని హంగులు పూర్తి చేసి అక్టోబర్ లో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా ఎఫెక్ట్ తో విడుదల వాయిదా పడేలా ఉంది .

గ్యాస్ లీక్ వెనుక విజయసాయి రెడ్డి!

ఇక తాజా గా వచ్చిన వార్తలను బట్టి ఈ సినిమాకు భారీ డిజిటల్ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ, తమిళ భాషలు అన్నింటికీ కలిపి అమెజాన్ డిజిటల్ సంస్థ రూ.55 కోట్ల అఫర్ ఇచ్చిందట… అయితే ఈ డీల్ ఫై నిర్మాతలు ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని అంటున్నారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత బాలన్స్ ఉన్న షూటింగ్ పూర్తి చేసి సినిమా బిజినెస్ గురించి అప్పుడు ఆలోచిస్తారట …