https://oktelugu.com/

Bheemla Nayak: భీమ్లా నాయక్ కి అదిరిపోయే ఆఫర్… అమెజాన్ ప్రైమ్‌ 150 కోట్ల డీల్‌

Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ”భీమ్లా నాయక్”. ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా… ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్‌పై పతాకంపై నాగవంశీ ఈ సినిమామను నిర్మిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్టైనా చిత్రం “అయ్యప్పనమ్ కోషీయమ్” మూవీకి రీమేక్‌గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు విడుదల కానుందని […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 23, 2021 / 09:29 AM IST
    Follow us on

    Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ”భీమ్లా నాయక్”. ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా… ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్‌పై పతాకంపై నాగవంశీ ఈ సినిమామను నిర్మిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్టైనా చిత్రం “అయ్యప్పనమ్ కోషీయమ్” మూవీకి రీమేక్‌గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు విడుదల కానుందని చిత్రబృందం ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ మూవీ గురించి ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

    ప్రముఖ ఓటిటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి ఈ చిత్రానికి భారీ ఆఫర్ వచ్చిందని సమాచారం. ఈ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేస్తే అమెజాన్ ప్రైమ్ ఏకంగా రూ.150 కోట్ల వరకు ఆఫర్ చేసిందని టాక్ వినిపిస్తుంది. అయితే ఇంత పెద్ద ఆఫర్‌ను కూడా మూవీ మేకర్స్ పక్కకు పెట్టారని అనుకుంటున్నారు. ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారని తెలుస్తుంది.

    ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ నెలాఖరు లోపు షూటింగ్ పూర్తి చేసి… తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూడాలని మూవీ యూనిట్ భావిస్తుందట. ఇక పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్ నటిస్తుండగా… రానా సరసన హీరోయిన్‌గా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఈ మూవీ తమన్ సంగీతం అండిచఫామ్ మరో హైలైట్ అని చెప్పాలి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పాటలకు అదీరిపోయే రెస్పాన్స్ లభిస్తుంది.