Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ఎప్పటికీ డిఫరెంట్ డిఫరెంట్ గా జరుగుతుంటుంది. కంటెస్టెంట్స్ చేతిలో ఏది ఉండదనేది నిజం. ఎందుకంటే ఎప్పటి నుంచో కెప్టెన్ కావాలనే కోరికతో ఉన్న కంటెస్టెంట్స్ లో అమర్ దీప్ ఒకరు. అన్ని విధాలుగా అర్హత ఉన్నా కూడా ఇప్పటికీ కెప్టెన్ కాలేకపోతున్నాడు. ప్రారంభంలో ఫౌల్ గేమ్స్ బాగా ఆడినప్పటికీ, తన తప్పును తెలుసుకొని ఆట తీరు మొత్తాన్నిమార్చుకొని రోజు రోజుకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతూ వచ్చాడు. అందరితో మంచిగా ఉండడానికి కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అదే సమయంలో ఎంటర్టైన్మెంట్ తో పాటుగా, టాస్కులు కూడా పోటీ పడుతూ ఆడాడు.
కానీ హౌస్ లో అమర్ అంటే మొదటి వారం నుంచి అసూయతో రగిలిపోతున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది శివాజీ అని కొందరు అంటుంటారు. అయినా అమర్ పై ఎందుకు అంత కుళ్ళు అనే ప్రశ్నలు కూడా వేస్తుంటారు. అయితే ప్రేక్షకులు ఇలా ప్రశ్నించడానికి కారణం లేకపోలేదు. అమర్ వెనుక చేరి శివాజీ చాలా సార్లు తప్పుగా మాట్లాడుతుంటాడు. టాస్కులు లేని సమయంలో ఖాళీగా కూర్చుంటే కూడా శివాజీ చేసే పని అమర్ పై ఏదో ఒకటి మాట్లాడడమే అంటూ నెగిటివిటీని సంపాదించాడు.
ఇంత జరుగుతున్నా కూడా అమర్ మాత్రం శివాజీకీ ఎంతో గౌరవం ఇస్తుంటాడు. కానీ శివాజీ మాత్రం ఛాన్స్ దొరికితే అమర్ పై విషం కక్కుతుంటాడు అనే ప్రచారం ఉంది. అంతేకాదు ఈ విషయంలో నాగార్జున కూడా అమర్ కు క్లాస్ పీకాడు. ఈ వారం మారుతాడు అనుకుంటే అదే పద్దతి పాటించాడు. కానీ ఈ వారం జరిగిన ఫన్నీ టాస్కులో కూడా అమర్ ను కించపరిచే విధంగా మాట్లాడాడు శివాజి.
ఇదంత పక్కన పెడితే ఈ సారి అయినా కెప్టెన్ అవుతాడని అందరూ అనుకున్నారు. ఈ వారం కెప్టెన్ అయ్యే విషయం హౌస్ మేట్స్ చేతిలో ఉంటే.. కచ్చితంగా అందరూ కలిసి అమర్ దీప్ ను కెప్టెన్ చేస్తారని అనుకున్నారు. దాదాపుగా అందరూ సపోర్ట్ చేశారు కానీ శివాజీ మాత్రం చెయ్యలేదు. ఎంత ఏడుస్తున్న, బతిమిలాడినా కూడా అతను అర్జున్ ని సపోర్ట్ చేస్తూ అమర్ దీప్ ఫోటోని కాల్చేశాడు. అర్జున్ భార్యకు మరోసారి కెప్టెన్ ని చేస్తా అని మాట ఇచ్చాను. అందుకే నా సపోర్ట్ అతనికే అంటూ అమర్ ఎంత బతిమిలాడినా శివాజీ కనికరించలేదు. నువ్వు ఎంత ఏడ్చినా లాభం లేదనే విధంగా ప్రవర్తించాడు. కానీ ఈ ఎపిసోడ్ తో అమర్ టాప్ 1లో ఉంటాడని అందరూ అనుకుంటున్నారు. మరి చూడాలి చివరకు ఏం అవుతుందో…