Amaran : ఈ ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై, బాక్స్ ఆఫీస్ వద్ద ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోయే రేంజ్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన సినిమా ‘అమరన్’. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా ఒకటి విడుదల ఉందనే విషయం శివ కార్తికేయన్, సాయి పల్లవి మన బిగ్ బాస్ షో కి అతిధులుగా వచ్చినప్పుడు తెలిసింది. అంత తక్కువ పబ్లిసిటీ తో విడుదలైన ఈ సినిమాకి ఓపెనింగ్స్ దగ్గర నుండి క్లోజింగ్ వరకు ట్రేడ్ పండితులు సైతం విస్మయానికి గురయ్యే రేంజ్ వసూళ్లను రాబట్టింది. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ సినిమా ఎట్టకేలకు నిన్నటితో థియేట్రికల్ రన్ ని ముగించుకుంది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఇప్పటి వరకు ఎంత వసూళ్లను రాబట్టింది, తెలుగు తమిళ భాషల్లో నిర్మాతలకు ఎంత లాభాలను తెచ్చిపెట్టింది అనేది వివరంగా ఈ కథనం లో చూద్దాము.
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 5 కోట్ల రూపాయలకు జరిగింది. కానీ విడుదల తర్వాత ఈ సినిమాకి వచ్చిన వసూళ్లు అక్షరాలా 28 కోట్ల రూపాయిలు. అంటే పెట్టిన ప్రతీ పైసా 5 రెట్ల కంటే ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టింది అన్నమాట. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలవారీగా ఒకసారి చూస్తే నైజం ప్రాంతం లో 13 కోట్ల రూపాయిలు, సీడెడ్ లో 3 కోట్ల 20 లక్షల రూపాయిలు, ఆంధ్ర ప్రాంతంలో 12 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో గ్రాస్ పరంగా చూస్తే 50 కోట్ల రూపాయలకు పైగానే వచ్చినట్టు తెలుస్తుంది. శివకార్తికేయన్ కెరీర్ లోనే ఈ సినిమా తెలుగు వెర్షన్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే తమిళనాడు లో ఈ చిత్తానికి 170 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
అదే విధంగా కర్ణాటక లో 24 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా కేరళలో 14 కోట్ల రూపాయిలు, రెస్ట్ ఆఫ్ ఇండియా లో 5 కోట్ల రూపాయిలు, ఓవర్సీస్ లో 80 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 340 కోట్ల రూపాయిలు వచ్చినట్టు తెలుస్తుంది. ఇది సాధారణమైన విషయం కాదు. నిన్న మొన్నటి వరకు ఒక మీడియం రేంజ్ హీరో గా మాత్రమే కొనసాగిన శివ కార్తికేయన్, ఈ చిత్రంతో ఏకంగా స్టార్ హీరోల లీగ్ లోకి అడుగుపెట్టాడు. ఈ సినిమాకి నిర్మాతగా కమల్ హాసన్ వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆయనకీ దాదాపుగా వంద కోట్ల రూపాయిల లాభం కేవలం థియేటర్స్ నుండి వచ్చాయి. ఇక ఓటీటీ, డిజిటల్, ఆడియో, డబ్బింగ్ రైట్స్ తో కలిపి మరో వంద కోట్ల రూపాయలకు పైగా లాభం వచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు.