Amardeep: అమర్ దీప్ బిగ్ బాస్ షో లో అడుగుపెట్టగానే ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్, టైటిల్ విన్నర్ అని ఫిక్స్ అయిపోయారు. అందరూ అనుకున్నది ఒకటి కానీ జరుగుతున్నది మరొకటి. అమర్ అందరి అంచనాలు అందుకోలేక పోయాడు. మాటలు తప్ప చేతలు లేవు. ఫౌల్ గేమ్ ఆడుతూ పిచ్చి పిచ్చిగా వాగడం. పక్క వాళ్ళు గెలిస్తే పడి ఏడవడం. ఇలా అమర్ చేసిన తప్పులకి విపరీతమైన నెగిటివిటీ పెరిగిపోయింది.ప్రతి వారం నాగార్జున తో తిట్లు తింటూ కూడా తన తీరు మార్చుకోలేదు.నెటిజన్స్ అమర్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. వీటిపై స్పందిస్తూ అమర్ తల్లి ఇలా మాట్లాడారు.
నిజానికి అమర్ మంచి ఆటగాడు. టాస్కుల్లో కష్టపడి ఆడుతున్నాడు కానీ, కలిసి రావడం లేదు. కొందరు అమర్ ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. అమర్ దీప్ గురించి చాలా నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. చాలా బ్యాడ్ చేస్తున్నారు. కష్టపడి ఈ స్థాయికి ఎదిగాడు. చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. మీరు దయ చేసి బ్యాడ్ కామెంట్స్ ఆపేయండి. అమర్ దీప్ కి సపోర్ట్ చెయ్యండి.అమర్ మంచి నటుడు ఇంకా డాన్సర్.
రైతుల గురించి ఎవరు ఎప్పుడు తప్పుగా మాట్లాడరు. రైతు ఎప్పుడూ రాజే,నేను కూడా రైతు బిడ్డనే, అమర్ తండ్రి ఒక మెకానిక్. ఇక్కడ ఎవరు పెద్ద స్థాయిలో లేరు. మేము కూడా మిడిల్ క్లాస్ వాళ్ళమే. అమర్ కి పొగరు అంటున్నారు ,అలా కాదు అమర్ చాలా మంచివాడు అని చెప్పుకొచ్చింది. దయచేసి తన కొడుకును బ్యాడ్ చెయ్యొద్దు అంటూ ఎమోషనల్ అయ్యింది. కొడుకు పై వస్తున్న ట్రోలింగ్ చూసి తట్టుకోలేక ఈ వీడియో రిలీజ్ చేసింది అమర్ తల్లి.
ఇక మొదటి వారం నుండి అమర్ దీప్ గేమ్ సరిగా లేదు. అతడిలో క్లారిటీ మిస్ అయ్యింది. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ని అతడు టార్గెట్ చేయడం కూడా మైనస్ అయ్యింది. పల్లవి ప్రశాంత్ పవర్ అస్త్ర పొందడంతో పాటు కెప్టెన్ గా గెలిచాడు. అమర్ మాత్రం ఇంత వరకు తన మార్క్ చూపించలేకపోయాడు.