Amardeep: అమర్ కి అరుదైన వ్యాధి, గాయమైతే ప్రమాదమే… కీలక విషయాలు వెల్లడించిన భార్య తేజస్విని!

తాజాగా తేజస్విని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. కొన్ని విషయాల్లో శివాజీ గారి ప్రవర్తన వల్ల నేను బాధపడ్డాను. ఎందుకిలా అనుకునేదాన్ని. బహుశా అమర్ తనకు టఫ్ కాంపిటీషన్ ఇస్తాడనుకున్నాడేమో .. అందుకే అమర్ తో అలా ప్రవర్తించారేమో. నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినప్పుడు ఎన్నో చెప్పాలనుకున్నాను.

Written By: NARESH, Updated On : December 3, 2023 7:15 pm

Amardeep

Follow us on

Amardeep: బిగ్ బాస్ హౌస్ లో మొదట్లో శివాజీ, అమర్ దీప్ కి అస్సలు పడేది కాదు. ఎప్పుడూ ఇద్దరి మధ్య ఏదొక గొడవ జరుగుతూనే ఉండేది. అయితే కొంత కాలంగా ఇద్దరికి మంచి బాండింగ్ ఏర్పడింది. ఆ చనువుతో శివాజీ అమర్ ని ఏదోకటి అని అంటూ ఉంటాడు. అయితే గత కెప్టెన్సీ విషయంలో అమర్ పట్ల శివాజీ ప్రవర్తించిన తీరు, చులకన చేసి మాట్లాడటంతో అమర్ భార్య తేజస్విని సహించలేకపోయింది.

తాజాగా తేజస్విని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. కొన్ని విషయాల్లో శివాజీ గారి ప్రవర్తన వల్ల నేను బాధపడ్డాను. ఎందుకిలా అనుకునేదాన్ని. బహుశా అమర్ తనకు టఫ్ కాంపిటీషన్ ఇస్తాడనుకున్నాడేమో .. అందుకే అమర్ తో అలా ప్రవర్తించారేమో. నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినప్పుడు ఎన్నో చెప్పాలనుకున్నాను. కానీ హౌస్ లోపలికి వెళ్ళాక ఏది గుర్తులేదు. అమర్ తప్ప ఎవరూ కనిపించలేదు. తనే అందరిని పరిచయం చేశాడు.

అమర్ దీప్ కి శివాజీ అంటే ప్రత్యేక గౌరవం ఉంది. అందుకే నన్ను ఆయన దగ్గరకు తీసుకెళ్ళాడు, ఆశీర్వాదం తీసుకున్నాం. అమర్ కు అనారోగ్య సమస్యలు ఉన్నాయి. బిగ్ బాస్ షో లో కి వెళ్ళక ముందు కూడా తనకు విపరీతమైన బ్యాక్ పెయిన్ ఉంది. హౌస్ లోకి వెళ్లే ముందు రోజు కూడా అతనికి ఫిజియోథెరపీ జరిగింది. అంత నొప్పి అనుభవిస్తూనే షో కి వెళ్ళాడు. ఇప్పటికి అమర్ ఆ నొప్పి అనుభవిస్తున్నాడు.

తనకు వెన్ను నొప్పి ఉన్న సంగతి బయటకు చెప్పలేదు. ఎక్కడ సింపతీ అనుకుంటారేమో అని తన అనారోగ్య సమస్యను ఎవ్వరికి చెప్పట్లేదని నాకు చెప్పాడు. నొప్పి తగ్గడానికి డాక్టర్ రాసిచ్చిన క్రీం పంపిస్తూనే ఉన్నాను. తనకు కండరాల బలహీనత కూడా ఉంది. దీని వల్ల ఏదైనా దెబ్బ తగిలితే అక్కడ ఫ్రాక్చర్ అవుతుంది అని డాక్టర్ చెప్పారు. అయినా ఏమి లెక్క చేయకుండా అమర్ బిగ్ బాస్ షో కి వెళ్ళాడు. అందుకే మొదట్లో టాస్క్ లు పెద్దగా ఆడలేదు. ఇప్పుడు తన ఆరోగ్యం కూడా పక్కన పెట్టి తెగించి ఆడుతున్నాడు అంటూ, తేజస్వి కీలక విషయాలు వెల్లడించింది.