Amala Paul Second Marriage: ‘మైన’ అనే సినిమాతో సౌత్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి ‘అమలా పాల్’ ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది. ఎన్నో భరించి సహించి ఎలాగోలా తనదైన గ్లామర్ తో, నటనతో తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో జోడి కట్టింది. ఆ సమయంలోనే స్టార్ హీరోయిన్ అని పిలిపించుకునే స్థాయికి వెళ్ళింది. పైగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ఇలా సౌత్ సినిమాల అన్నిటిల్లో నటించింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అమలా పాల్, తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ తో ప్రేమాయణం సాగించి.. అతన్ని పెళ్లి చేసుకుంది.

అయితే, పెళ్లి తరువాత కొన్నాళ్ల పాటు బాగానే కాపురం చేసింది. కానీ ఏమైందో ఏమో గాని దర్శకుడు విజయ్, అమలాపాల్ ను మధ్యలో విడిచిపెట్టాడు. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో పెళ్లి విషయంలో తానూ మోసపోయానని, తానూ తొందరపడకుండా ఉండాల్సిందని అమలాపాల్ చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్న ఈ అమ్మడు సినిమాలపైనే ఫోకస్ పెట్టి.. సెకెండ్ ఇన్నింగ్స్ ను బాగానే హ్యాండిల్ చేస్తోంది.
కానీ, అమలా పాల్ రెండో పెళ్లి పై ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆమె ఆల్ రెడీ ఓ సింగర్ ను పెళ్లి చేసుకుంది అని కూడా ప్రచారం జరుగుతుంది. మొత్తమ్మీద తన రెండో పెళ్లి పై తాజాగా అభిమానులకు ఈ మలయాళ బ్యూటీ క్లారిటీ ఇచ్చింది. ‘మిమ్మల్ని వివాహం చేసుకోవాలంటే.. ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి..?’ అని ఓ నెటిజన్ ఆమెకు ప్రశ్న అడిగాడు.

ఈ ప్రశ్నకు అమలా పాల్ ఆన్సర్ చెబుతూ.. ‘నాకు ఇప్పుడైతే మరో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ప్రస్తుతం నన్ను నేనుపూర్తిగా అర్థం చేసుకుని.. మరింత ఉన్నతంగా మార్చుకునే పనిలో ఉన్నాను. ఒకవేళ నేను మళ్లీ పెళ్లి చేసుకోవాలి అనుకున్నా.. నాకు కాబోయే భర్తకు ఎలాంటి అర్హతలు ఉండాలో నేను ఇప్పుడే
చెప్పలేను. కచ్చితంగా త్వరలో వెల్లడిస్తాను’ అంటూ ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది.
దాంతో ఈ బ్యూటీ ఇలా సమాధానం ఇవ్వడంతో అమలాకు రెండో పెళ్లి ఆలోచన ఉంది అంటూ ఆమె ఫాలోవర్స్ మెసేజ్ లు చేస్తున్నారు. ఇక అమలా పాల్ తన కెరీర్ గురించి చెబుతూ.. ‘నా కెరీర్ మొదట్లో నేను అన్ని విధాలుగా చాలా ఇబ్బందులు పడ్డాను, కొంతమంది మేనేజర్లకు అసలు విలువులు ఉండవు.. వాళ్లకు అవకాశం వస్తే హీరోయిన్లతో వాళ్ళు ఆడుకుంటారు. ఒకవిధంగా నా సినీ ప్రయాణం మోసంతోనే మొదలైంది’ అంటూ అమలాపాల్ చెప్పుకొచ్చింది.