https://oktelugu.com/

Rashmika Mandanna- Shraddha Kapoor: రష్మిక మందన్నాతో పాటు శ్రద్ధా కపూర్ కూడా రెడీ.. తెలుగు డైరెక్టర్ క్రేజీ ప్లాన్

Rashmika Mandanna- Shraddha Kapoor: అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ దర్శకుడిగా మారిన సందీప్ వంగ.. బాలీవుడ్‌లో రణబీర్ కపూర్‌తో ‘యానిమల్’ సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం ‘యానిమల్’ షూటింగ్ మనాలిలో జరుగుతోంది. ఈ సినిమాలో రష్మికా మందాన హీరోయిన్‌ గా నటిస్తోంది. సందీప్‌రెడ్డి.. గతంలో షాహీద్ కపూర్ హీరోగా ‘కబీర్‌సింగ్’ తెరకెక్కించాడు. అది ‘అర్జున్ రెడ్డి’కి రీమేక్. ఐతే చేసిన సినిమానే రెండుసార్లు చేసి బాగా బిల్డప్ చూపిస్తున్నాడు అంటూ సందీప్ పై బాలీవుడ్ లో నెగిటివ్ […]

Written By:
  • Shiva
  • , Updated On : July 19, 2022 / 04:32 PM IST
    Follow us on

    Rashmika Mandanna- Shraddha Kapoor: అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ దర్శకుడిగా మారిన సందీప్ వంగ.. బాలీవుడ్‌లో రణబీర్ కపూర్‌తో ‘యానిమల్’ సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం ‘యానిమల్’ షూటింగ్ మనాలిలో జరుగుతోంది. ఈ సినిమాలో రష్మికా మందాన హీరోయిన్‌ గా నటిస్తోంది. సందీప్‌రెడ్డి.. గతంలో షాహీద్ కపూర్ హీరోగా ‘కబీర్‌సింగ్’ తెరకెక్కించాడు. అది ‘అర్జున్ రెడ్డి’కి రీమేక్. ఐతే చేసిన సినిమానే రెండుసార్లు చేసి బాగా బిల్డప్ చూపిస్తున్నాడు అంటూ సందీప్ పై బాలీవుడ్ లో నెగిటివ్ ప్రచారం జరుగుతుంది.

    Rashmika Mandanna

    మరోపక్క సందీప్ మాత్రం క్రియేటివ్ డైరెక్టర్ అనే పేరుతో పాటు బోల్డ్ డైరెక్టర్ గా కూడా పేరు తెచ్చుకున్నాడు. పైగా నేషనల్ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు. మొత్తానికి ఒక్క సినిమానే రెండుసార్లు తీసి నేషనల్ డైరెక్టర్ రేంజ్ గుర్తింపు తెచ్చుకోవడం ఒక్క సందీప్ రెడ్డికే సాధ్యం అయింది. నిజానికి ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా పరిణీతి చోప్రాను తీసుకున్నారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది.

    Also Read: Ileana: కత్రినా కైఫ్ సోదరుడితో హీరోయిన్ ఇలియానా ప్రేమాయణం..త్వరలోనే పెళ్లి ?

    దాంతో ఈ సినిమాలో చిత్రబృందం హీరోయిన్‌గా రష్మికను కన్ఫర్మ్‌ చేశారు. ఇప్పటికే పుష్పతో నేషనల్‌ క్రష్‌గా పేరు తెచ్చుకుంది రష్మిక. ఇప్పుడు ఈ సినిమాతో ఆమె క్రేజ్ రెట్టింపు కానుంది. అన్నట్టు ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌ను దర్శకుడు ప్లాన్ చేయగా.. ఇందుకోసం శ్రద్ధా కపూర్ ను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

    Shraddha Kapoor:

    మొత్తానికి రణబీర్ కోసం లవ్ కి రష్మికను రొమాన్స్ కి శ్రద్ధా కపూర్ ను సందీప్ సెట్ చేశాడు. రంగస్థలంలో స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేసిన ఆమె.. ‘యానిమల్’ కోసం కూడా కొత్త స్టెప్స్ వేయబోతుంది. యాక్షన్‌, క్రైమ్‌ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో రణబీర్‌తో పాటు అనిల్ కపూర్ ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు. అలాగే సీనియర్ నటుడు బాబీ డియోల్ కూడా ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు.

    అనిల్ కపూర్ – రణబీర్ కపూర్ – బాబీ డియోల్ కాంబినేషన్ మల్టీస్టారర్ అంటే.. ఫుల్ క్రేజ్ ఉంటుంది. మరి ఈ క్రేజీ కాంబినేషన్‏లో రాబోతున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇదొక పునర్జన్మల కాన్సెప్ట్. ఇక మునుపెన్నడూ రాని సరికొత్త కాన్సెప్టుతో ఈ సినిమాని తీస్తున్నారని బాలీవుడ్ మీడియాలో బాగా టాక్ నడుస్తోంది.

    Also Read:Puvvada on Polavaram: పోల‘రణం’.. ఆంధ్రాకు వరం… టెంపుల్‌ సిటీకి శాపమేనా!?

    Tags