Homeఎంటర్టైన్మెంట్Sree Vishnu Alluri Teaser: అల్లూరి టీజ‌ర్‌ : ”ఎక్క‌డి దొంగ‌లు అక్క‌డే గ‌ప్ చుప్‌.....

Sree Vishnu Alluri Teaser: అల్లూరి టీజ‌ర్‌ : ”ఎక్క‌డి దొంగ‌లు అక్క‌డే గ‌ప్ చుప్‌.. పోలీస్ బ‌య‌ల్దేరాడు రా” !

Sree Vishnu Alluri Teaser: ఆ కుర్రాడికి చిన్నతనం నుండే సినిమాలంటే విపరీతమైన పిచ్చి. ఆ పిచ్చి, ఆ ఇష్టమే అతన్ని నేడు హీరోను చేసింది. యంగ్ హీరో శ్రీవిష్ణు ప్రస్తుతం తెలుగు చిత్ర సీమలో మంచి టాలెంట్ ఉన్న హీరో. శ్రీవిష్ణు హీరోగా ‘అల్లూరి’ అనే సినిమా రాబోతుంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ ని ఆవిష్కరించారు మేకర్స్. శ్రీవిష్ణు అల్లూరిలో పోలీసుగా అదరగొట్టాడు. “ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్” అనే వాయిస్‌ ఓవర్‌ తో మొదలైన ఈ టీజర్ లో శ్రీవిష్ణు ఎస్‌ఐగా కుమ్మేశాడు.

Sree Vishnu Alluri Teaser
Sree Vishnu

నక్సల్స్ ప్లేస్‌కి వెళ్లి మరీ, ఎస్‌ఐ అల్లూరి సీతారామరాజుగా తన దమ్ము చూపించాడు. ఆసక్తికర రీతిలో ప్రారంబమైన ఈ టీజర్ లో.. పవర్ ఫుల్ పోలీసు అధికారిగా శ్రీవిష్ణు చాలా బాగా ఆకట్టుకున్నాడు. దర్శకుడు ప్రదీప్ వర్మ శ్రీవిష్ణు పాత్రకు పర్ఫెక్ట్ ఎలివేషన్స్ ఇచ్చాడు. హర్షవర్ధన్ రామేశ్వర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఈ టీజర్ స్థాయిని పెంచింది. టీజర్‌ గ్రిప్పింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా సాగింది. సినిమా కూడా ఆ స్థాయిలోనే ఉండబోతుందని అర్ధం అవుతుంది.

Also Read: Modi vs KCR: కేసీఆర్ పై రివేంజ్ తీర్చుకున్న మోడీ..

ఈ సినిమాలో కథానాయికగా నటించిన కయదు లోహర్ కూడా చాలా క్యూట్ గా నటించిందట. ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ టీజర్ కూడా సినిమా పై చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. ఒక పాట మినహా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. అల్లూరి రిలీజ్ డేట్ త్వరలో వెల్లడి కానుంది. నిజానికి తన సినిమా బడ్జెట్ విషయంలో వంద ఆలోచించే నిర్మాత బెక్కం వేణుగోపాల్ కూడా ఈ సినిమా విషయంలో అసలు బడ్జెట్ పరిమితులే పెట్టుకోలేదు.

Sree Vishnu Alluri Teaser
Alluri Movie

మరో నిర్మాత దిల్ రాజు కూడా ఈ సినిమా కథ విని నిర్మాణంలో తాను భాగం కావాలని ఏరికోరి వచ్చారట. మరి ఇంతమంది ఈ సినిమాని నమ్మడానికి కారణం ఒక్కటే.. సినిమా అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందట. చూడాలి మరి అల్లూరి ఏ రేంజ్ హిట్ అవుతుందో.

ఏది ఏమైనా శ్రీ‌విష్ణు ముందు నుంచీ వైవిధ్య‌భ‌రిత‌మైన క‌థ‌ల‌నే ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. అయితే.. ఇలాంటి ప్రయోగాలు చేసిన ప్రతి దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తనకు విజ‌యాలూ ద‌క్కకపోయినా పర్వాలేదు. డిఫరెంట్ సినిమాలే తన టార్గెట్ అంటున్నాడు ఈ హీరో.

Also Read: Yadamma Special Dishes For PM Modi: యాదమ్మ వంటలకు ఫిదా.. టేస్ట్ చేసి మోడీ ఏమన్నాడో తెలుసా?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version