Allu Sirish engagement: అల్లు కుటుంబం లో చాలా రోజుల తర్వాత పెళ్లి సందడి కనిపించింది. అల్లు అర్జున్(Icon Star Allu Arjun) సోదరుడు అల్లు శిరీష్(Allu sirish) ఈ నెల 31న నైనికా అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోబోతున్నాడు. దీనికి సంబందించి ఆయన అధికారిక ప్రకటన కూడా చేసాడు. పెద్దగా హంగులు ఆర్భాటాలు లేకుండా తన ఇంట్లోనే అవుట్ డోర్ ప్రాంతం లో నిశ్చితార్థం చేసుకోవాలని ప్లానింగ్ చేసుకున్నాడు. మంచిగా డెకరేషన్ కూడా చేసుకున్నారు. కానీ ఇంతలోపే ‘మొంత’ తుఫాన్ కారణంగా హైదరాబాద్ లో బలమైన ఈదురు గాలులు, విస్తారంగా వర్షాలు కురవడంతో నిశ్చితార్థం కోసం ఏర్పాటు చేసుకున్న వేదిక మొత్తం చెల్లాచెదురు అయిపోయింది. దీంతో అల్లు శిరీష్ విచారంగా మాట్లాడుతూ ‘మొంత తుఫాన్ తన నిశ్చితార్థం ప్లాన్స్ మొత్తం నాశనం చేసింది’ అంటూ ఒక ఫోటో ని షేర్ చేసి చెప్పుకొచ్చాడు. ఇది బాగా వైరల్ అయ్యింది.
అయితే నిశ్చితార్థం మాత్రం ఆగిపోలేదు. అవుట్ డోర్ లో ప్లాన్ చేసుకున్న ఈ ఈవెంట్ ని ఇప్పుడు ఇన్ డోర్ కి షిఫ్ట్ చేశారు. ఈ నిశ్చితార్ధ వేడుకకు మెగా ఫ్యామిలీ తో పాటు ఇండస్ట్రీ లోని ప్రముఖులందరూ హాజరు కాబోతున్నారు. అయితే అందరిలో ఒక సందేహం మొదలైంది. అల్లు శిరీష్ నాన్నమ్మ చనిపోయి కనీసం రెండు నెలలు కూడా అవ్వలేదు, చనిపోయిన కుటుంబం ఇంట్లో కనీసం ఆరు నెలల వరకు శుభకార్యాలు చేయకూడదు అని పెద్దలు అంటుంటారు. కానీ ఇక్కడ కేవలం రెండు నెలల్లోనే శుభ కార్యం చేస్తున్నారు, అల్లు అర్జున్ కుటుంబానికి సంప్రదాయాలు అనుసరించే అలవాటు లేదా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు. మరి దీనికి అల్లు ఫ్యామిలీ నుండి ఏమైనా క్లారిటీ వస్తుందో లేదో చూడాలి. నిన్న మొన్నటి వరకు అల్లు శిరీష్ ఒక ప్రముఖ యంగ్ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడు అంటూ వార్తలు వినిపించేవి.
కానీ అందరి అంచనాలను తలక్రిందలు చేస్తూ, నైనికా అనే అమ్మాయితో ఆయన వివాహం ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నైనికా ఇండస్ట్రీ కి చెందిన అమ్మాయి కాదు. ఈమె ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త కూతురు అని తెలుస్తుంది. ఇక అల్లు శిరీష్ సినిమాల విషయానికి వస్తే, ప్రేక్షకులకు సరికొత్త థియేట్రికల్ అనుభూతి కలిగించాలని డిఫరెంట్ సబ్జక్ట్స్ ని ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు కానీ, ఆయన సినిమాలను జనాలు ఆదరించడం లేదు. కెరీర్ మొత్తం మీద కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు సినిమాలు మాత్రమే సూపర్ హిట్స్ గా నిలిచాయి. అవి కూడా ఆయన కెరీర్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్లలేకపోయాయి. ఆయన నుండి చివరిగా విడుదలైన చిత్రం ‘బడ్డీ’. ఇది ఎప్పుడు రిలీజ్ అయ్యిందో, ఎప్పుడు థియేటర్స్ నుండి వెళ్లిపోయిందో కూడా జనాలకు తెలీదు. అంత పెద్ద ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం ఆయన చేతిలో ఎలాంటి సినెమాలు లేవు.