Allu Sirish wearing necklace: రీసెంట్ గానే అల్లు అర్జున్(Icon Star Allu Arjun) సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish) నిశ్చితార్థం నైనికా అనే అమ్మాయి తో గ్రాండ్ గా జరిగింది. ఈ నిశ్చితార్దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. మెగా ఫ్యామిలీ మొత్తం ఈ వేడుకకు హాజరు అవ్వగా, కొంతమంది సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఇదంతా పక్కన పెడితే అల్లు శిరీష్ ఈ నిశ్చితార్ధ వేడుకలో వేసుకున్న కాస్ట్యూమ్స్ పై, మెడకు ధరించిన జ్యువెలరీ పై సోషల్ మీడియా లో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. అమ్మాయిలు వేసుకున్న జ్యువెలరీ ని అల్లు శిరీష్ ధరించాడని, ఇదేమి స్టైలింగ్ బాబోయ్ అంటూ వెక్కిరిస్తున్నారు. అడవి మనుషులకు నేటి నాగరికతకు తగ్గట్టుగా రెడీ అవ్వమంటే ఇలాగే రెడీ అవుతారేమో అంటూ ఫన్నీ ట్రోల్స్ వేస్తున్నారు. ఐకాన్ స్టార్ కంటే ముందు అల్లు అర్జున్ ని స్టైలిష్ స్టార్ అని పిలిచేవారు అనే సంగతి మనకు తెలిసిందే.
అలాంటి స్టైలిష్ స్టార్ తమ్ముడు, అన్నయ్య ని అనుసరించడం లో తప్పేమి ఉందంటూ సోషల్ మీడియా లో రామ్ చరణ్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఆడవాళ్లు తాళి ని బరువు అని ఫీల్ అవుతున్న ఈ రోజుల్లో, మగవాళ్ళు చూడండి ఆడవాళ్ళ నగలను ఎలా హ్యాండిల్ చేస్తున్నారో, చూసి నేర్చుకోండమ్మా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది అయితే ఆలస్యం ఎందుకు, మంగళసూత్రం కూడా నువ్వే కట్టించుకో అంటూ ఎగతాళి చేస్తున్నారు. ఇలా ఎక్కడ చూసినా ఈ ఫోటో గురించే ఇప్పుడు చర్చ నడుస్తోంది. సోషల్ మీడియా అన్న తర్వాత ఇలాంటి ట్రోల్స్ సర్వ సాధారణం. పైగా ఈమధ్య మెగా మరియు అల్లు ఫ్యామిలీ మధ్య ఫ్యాన్ వార్స్ తారా స్థాయిలో జరుగుతున్నాయి. ఒకరి మీద ఒకరు పోటీ పడీమరీ ట్రోల్స్ చేసుకుంటున్నారు. నిన్న విడుదలైన పెద్ది మూవీ ‘చికిరి’ సాంగ్ ప్రోమో పై ఎన్ని ట్రోల్స్ వచ్చాయో మనమంతా చూసాము. ట్విట్టర్ లో ఇదొక నిరంతర ప్రక్రియ లాగా మారిపోయింది.
ఫ్యాషన్ తెలియని అడవి మనుషులు టాలీవుడ్ సెలబ్రిటీలకి స్టయిల్ నేర్పించాలి అంటే అల్లు ఫ్యామిలీ నే !
Allu Sirish wearing Victorian Diamond necklace ! pic.twitter.com/r0YBarynib
— Telugu360 (@Telugu360) November 6, 2025
తాళి బరువు అవుతున్న ఈరోజుల్లో….!!!
మన మగ వాళ్ళు చూడండి ఆడవాళ్ళ నెక్లెస్ వేసుకున్నారు…— GGKrishna (@NBK__MB) November 6, 2025
Arey a managalasutram kund nuve kattukora allunsirish .
Jambalakidipamba nijamen anipistundi— Bharath Gandamalla (@BharathGan65835) November 6, 2025