Bigg Boss 9 fame Emmanuel: నేడు స్టార్ సెలబ్రిటీస్ గా లగ్జరీ లైఫ్ ని ఎంజాయ్ చేసిన ప్రతీ ఒక్కరు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే. ఎంత పెద్ద స్టార్ సెలబ్రిటీ కొడుకు అయినా కూడా కష్టపడాల్సిందే, లేదంటే ఈ ఇండస్ట్రీ లో మనుగడ ఉండదు. ఇక ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చిన సెలబ్రిటీల పరిస్థితి అయితే ఊహించడానికి కూడా కష్టమే. వాళ్ళ కష్టాలు విన్న తర్వాత ఇలాంటి పనులు అసలు మనం చేయగలమా? అనే ఆలోచన వస్తోంది. అలాంటి సెలబ్రిటీలలో ఒకరు ఇమ్మానుయేల్. జబర్దస్త్ షో ద్వారా కమెడియన్ గా బుల్లితెర ఆడియన్స్ కి పరిచయమై, ఆ తర్వాత ఎన్నో టీవీ షోస్ ద్వారా కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు. అడపాదడపా కొన్ని సినిమాల్లో కూడా నటించాడు. ప్రస్తుతం ఆయన బిగ్ బాస్ సీజన్ 9 లో ఒక టాప్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్నాడు.
బిగ్ బాస్ హిస్టరీ లోనే ఈ రేంజ్ ఆల్ రౌండర్ ని ఇప్పటి వరకు చూడలేదంటూ ఈ సీజన్ ని చూస్తున్న ప్రతీ ఒక్కరు ఇమ్మానుయేల్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కామెడీ చేయడమే కాదు, ఎలాంటి ఫిజికల్ టాస్క్ ఇచ్చినా, బ్రెయిన్ తో ఆలోచించే గేమ్స్ అయినా, ఇమ్మానుయేల్ అదరగొట్టేస్తున్నాడు. ఈ సీజన్ టాప్ 3 కంటెస్టెంట్స్ గా ఎవరెవరు నిలవబోతున్నారు అనే ప్రశ్న అడిగితే, బిగ్ బాస్ షో ని చూసే ప్రతీ ఒక్కరు ఇమ్మానుయేల్ పేరు ని కచ్చితంగా చెప్తారు. అంత అద్భుతమైన గేమ్స్ ఆడడం ఆయన సొంతం. అయితే హౌస్ లో ఉన్నప్పుడు ఈయన తన జీవితం లో ఎదురుకున్న కష్టాల గురించి తోటి కంటెస్టెంట్స్ తో చెప్పుకొచ్చాడు. బుల్లితెర రంగం లోకి రాకముందు ఇమ్మానుయేల్ బిల్డింగ్ కంస్ట్రక్షన్స్ వర్క్ లో కూలీ గా పని చేసేవాడట.
రోజుకి కేవలం 70 రూపాయిల కూలీ మాత్రమే వచ్చేది అట. చదువు లో చిన్నప్పటి నుండే మంచి టాపర్. కానీ తన ఇంటి ఆర్ధిక పరిస్థితి బాగాలేకపోవడం తో తన తల్లిదండ్రులతో కలిసి కూలీ కి వెళ్లి వస్తుండేవాడు అట. ఇంట్లో ఆర్ధిక పరిస్థితి మరింత మెరుగు పడేందుకు ఆయన ఒక స్కూల్ లో టైపిస్ట్ గా కూడా చేరాడట. చిన్న పిల్లల పరీక్ష పత్రాలు టైపింగ్ చేసేవాడట. అలా కెరీర్ సాగుతుండగా, ఒకరోజు ఈటీవీ లో ప్రసారమయ్యే ఒక స్టాండప్ కామెడీ షో ఆడిషన్స్ లో పాల్గొనే అవకాశం వచ్చిందని, నా కామెడీ టైమింగ్ బాగా నచ్చడం తో జబర్దస్త్ లో తీసుకున్నారని, అలా మొదలైన కెరీర్ ఇప్పుడు ఇలా ఉందని చెప్పుకొచ్చాడు ఇమ్మానుయేల్. ఇంత అద్భుతమైన టాలెంట్ ఉన్నప్పటికీ ఎందుకో ఇమ్మానుయేల్ కి ఇంకా సినిమా అవకాశాలు మాత్రం రాలేదు. కానీ బిగ్ బాస్ 9 తర్వాత ఆయనకు కచ్చితంగా భారీ అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది.