Allu Sirish: అల్లు అరవింద్ ఫ్యామిలీ మెంబర్స్ గురించి తెలిసింది చాలా తక్కువ. హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్, శిరీష్ మాత్రమే అందరికీ పరిచయం ఉంది. అల్లు అరవింద్ పెద్ద కుమారుడు వెంకట్ పెద్దగా ఫోకస్ కాలేదు. అల్లు అరవింద్ స్టార్ ప్రొడ్యూసర్ గా ఉన్నప్పటికీ ఆయన సినిమా రంగంలోకి రాలేదు. ఇటీవల ఆయన నిర్మాతగా మారారు. వరుణ్ తేజ్ హీరోగా గని మూవీ నిర్మించారు. ఆయన మొదటి ప్రయత్నం ఫలించలేదు. గని అనూహ్యంగా డిజాస్టర్ అయ్యింది. ఇక అల్లు స్టూడియో పేరుతో ఫ్యామిలీ మొత్తం భాగస్వాములుగా పెద్ద స్టూడియో నిర్మించారు.

అల్లు స్టూడియోలో వెంకట్, అల్లు అర్జున్, శిరీష్ లకు వాటా ఉన్నట్లు సమాచారం. అల్లు అరవింద్ వారసులుగా ఈ ముగ్గురు మాత్రమే తెలుసు. అయితే ఆయనకు మరో కుమారుడు కూడా ఉన్నాడు. అతని పేరు రాజేష్. ఆయన గురించి ఎవరికీ తెలియదు. కారణం రాజేష్ బ్రతికి లేరు. ఆయన చిన్న వయసులోనే ఒక ప్రమాదంలో మరణించారు. ఈ సంఘటన జరిగి చాలా కాలం అవుతుంది. నలుగురిలో చిన్నవాడైన శిరీష్ పుట్టక ముందే రాజేష్ కన్నుమూశాడట.
ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో శిరీష్ బయటపెట్టారు. ఆలీతో సరదాగా టాక్ షోకి వచ్చిన శిరీష్ ని అలీ… ఈ ప్రశ్న మీ నాన్న అల్లు అరవింద్ ని అడిగితే ఎమోషనల్ అవుతాడని అడగలేదు. ఇంతకీ మీరు ఎంత మంది అన్నదమ్ములు? అని అడిగారు. అప్పుడు శిరీష్ ఈ సమాధానం చెప్పారు. పెద్దన్నయ్య వెంకట్ తర్వాత రాజేష్ అన్నయ్య, తర్వాత బన్నీ. రాజేష్ అన్నయ్య నేను పుట్టకముందే ప్రమాదంలో చనిపోయారని శిరీష్ వెల్లడించారు.

మరో విషాదకర సంఘటన ఏంటంటే అల్లు అరవింద్ బ్రదర్ కూడా చిన్న వయసులో అకాల మరణం చెందాడు. అల్లు రామలింగయ్య అతన్ని హీరో చేయాలి అనుకున్నాడట. ఆ చనిపోయిన కొడుకుని అల్లు రామలింగయ్య తనలో చూసుకున్నాడని చిరంజీవి ఇటీవల శతజయంతి వేడుకల్లో తెలియజేశారు. తన అభివృద్ధి ఆయన తన సొంత కొడుకు అభివృద్ధిగా అల్లు రామలింగయ్య చూశాడని చిరంజీవి చెప్పి ఎమోషనల్ అయ్యారు. అలా అల్లు ఫ్యామిలీకి చెందిన ఇద్దరు వారసులు అకాల మరణం పొందారు.