Homeఎంటర్టైన్మెంట్Allu Sirish gives wedding invitation to Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కి పెళ్లి...

Allu Sirish gives wedding invitation to Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కి పెళ్లి శుభలేఖ అందించిన అల్లు శిరీష్.. ఫోటోలు వైరల్!

Allu Sirish gives wedding invitation to Pawan Kalyan: మార్చి 6 న అల్లు కుటుంబం లో పెళ్లి భాజాలు మోగనున్న సందర్భంగా , అల్లు శిరీష్ తన కుటుంబ సభ్యులతో ఎక్కువగా కనిపిస్తున్నాడు. రీసెంట్ తల్లిదండ్రులతో కలిసి మెగాస్టార్ చిరంజీవి కి మొట్టమొదటి శుభలేఖ ని అందించగా , నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి , ఆయన సతీమణి అన్నా లెజినోవా కి పెళ్ళికి రావాల్సిందిగా శుభలేఖని అందించారు. అందుకు సంబంధించిన ఫోటోని మీరు క్రింద చూడొచ్చు. ఈ ఫొటోలో అల్లు శిరీష్ తో పాటు ఆయన తండ్రి అల్లు శిరీష్ తల్లి ఉన్నారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. గత కొంతకాలం గా పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ గొడవలు జరుగుతూ ఉండేవి.

2024 ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసీపీ పార్టీ కి చెందిన తన స్నేహితుడు శిల్ప రవి కి సపోర్ట్ చేయడానికి వెళ్లినప్పటి నుండి ఈ గొడవ మొదలైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు వీళ్ళ మధ్య గొడవలు చల్లారలేదు. రెండు మూడు సార్లు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కుటుంబం తో కలిసిన సందర్భాలు వచ్చినప్పటికీ గొడవలు ఆగలేదు. ఇప్పుడు సోషల్ మీడియా లో ఈ ఫోటో బాగా వైరల్ అవ్వడంతో ఇరువురి హీరోల అభిమానుల మధ్య కాస్త సఖ్యత వాతావరణం నెలకొంది. ఈ వాతావరణం ఎన్ని రోజులు ఉంటుందో చూడాలి. ఎందుకంటే మళ్లీ ఈ ఇద్దరు హీరోల అభిమానులు గొడవలు పడే అవకాశాలు ఉన్నాయి. సందర్భం వచ్చినప్పుడల్లా అల్లు అర్జున్ అభిమానులు పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేయడం , పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ ని ట్రోల్ చేయడం సర్వ సాధారణమైన విషయం అయిపోయింది.

వచ్చే నెల పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం విడుదల కాబోతుంది . కచ్చితంగా ఈ ఇద్దరి హీరోల అభిమానుల మధ్య మరోసారి ఫ్యాన్ వార్స్ భారీగా జరిగే అవకాశం ఉంది. ఇక అల్లు శిరీష్ పెళ్లి విశేషాల్లోకి వెళ్తే , ఆయన నయనికా అనే అమ్మాయిని పెళ్లాడబోతున్నాడు. చాలా కాలం నుండి వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తూ ఉన్నింది . డేటింగ్ కూడా చేసుకున్నారు . చివరికి పెద్దలను ఒప్పించి ఇప్పుడు పెళ్లి చేయూసుకోబోతున్నారు. ఈ పెళ్ళికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరు కానుంది. మరోసారి మెగా ఫ్యాన్స్ కి విజువల్ ఫీస్ట్ అయ్యే సందర్భాలు రాబోతున్నాయి అన్నమాట.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular