
అల్లు శిరీష్ వెనుక పెద్ద సినిమా సంస్థనే ఉంది. దాదాపు నలుగురు స్టార్ హీరోల సపోర్ట్ ఉంది. కానీ, హీరోగా మాత్రం మనోడు ఇంతవరకూ స్టార్ డమ్ ను సంపాధించలేకపోయాడు. గతేడాది ‘ఏబిసిడి’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించినా.. అల్లు శిరీష్ కి ఆ చిత్రం విజయాన్ని అందించలేకపోయింది. బలమైన బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. ఇంకా ఓ కమర్షియల్ హిట్ కోసం పరితపిస్తూనే ఉండాల్సిన పరిస్తితి శిరీష్ ది. నిజానికి మలయాళంలో ఏబీసీడీ అనే చిత్రం సూపర్ డూపర్ హిట్. ఈ సినిమా ఎవరు చేసిన హిట్ అనే రేంజ్ లో ఉంటుంది సినిమా. కానీ ఎందుకో అల్లు శిరీష్ హీరోగా వచ్చిన ఈ సినిమా పూర్తిగా తేలిపోయింది.
Also Read: డ్రగ్ కేసులో ప్రభాస్ ‘కటౌట్’ ను వాడేస్తున్నారు..!
మొత్తానికి ఎన్నో ఆశలు పెట్టుకున్న అల్లు శిరీష్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. ఆ తరువాత చాలా కథలు విని.. మళ్లీ ఓ కొత్త ప్రాజెక్ట్‌ను సెట్ చేసుకొని సెట్స్ మీదకు వెళ్దామంటే ఈ లోపు కరోనా వచ్చింది. దాంతో మనోడు అప్పటినుండి ఇంటికే పరిమితం అయ్యాడు. పైగా క్వారంటైన్, లాక్ డౌన్ మొత్తాన్ని ఒంటరిగానే గడిపాడట. కరోనా రోజులు ఎంతో కష్టంగా ఉన్నాయని, ఇక బ్యాచ్‌లర్‌గా ఉండటం ఎంత కష్టమైన పనో అంటూ ఆ మధ్య కొన్ని వీడియోలను కూడా షేర్ చేసి.. తన ఫాలోవర్స్ ను ఎంటర్ టైన్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే అల్లు శిరీష్ కి రోజురోజుకూ చికాకు పెరుగుతుందట. ఎంతసేపూ తినడం, పడుకోవడం, ఆడుకోవడం తప్పా మరో పని లేకపోవడంతో పిచ్చి లేస్తోందనట్లు అల్లు శిరీష్ తెగ ఇదైపోతున్నాడు. తాను బయటకు వెళ్లి 221 రోజులు అవుతోందని మొత్తానికి తన బాధను బయటకు వ్యక్తపరిచాడు అల్లు శిరీష్.

బయటకు అంటే.. ఇంటి నుండి కాదులేండి, హైదరాబాద్ నుండి అట. తానూ హైదరాబాద్ నుంచి బయటకు వెళ్లి 221 రోజులు అవుతున్నాయని.. శిరీష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మార్చ్ 1 నుంచి 3 వరకు ముంబైకి ఓ వర్క్ షాప్ కోసం వెళ్లాను. అదే చివరిది. మళ్లీ ఆ తరువాత ఇక బయటకు వెళ్ళిందే లేదు. సినిమా షూటింగ్స్ తో పాటు డైలీ లైఫ్ ను కూడా బాగా మిస్ అవుతున్నా. ముఖ్యంగా పనిని, ప్రయాణాన్ని, అలాగే ఎయిర్‌పోర్ట్ ను ఇలా అన్నిటిని మిస్ అవుతున్నాను. ఇంతకీ మీరు మీ ఇంటిని వదలక ఎన్ని రోజులు అవుతోంది అంటూ అల్లు శిరీష్ నెటిజన్లను కూడా ప్రశ్నించాడు. నెటిజన్లు కూడా కరోనా రోజుల్లో తమ ఇంటి అనుభవాన్ని కామెంట్స్ రూపంలో తేలుపుతున్నారు. ఏమైనా అల్లు శిరీష్ పోస్ట్ చూస్తుంటే.. రోజులు లెక్కబెట్టుకుంటూ బాధగా కాలాన్ని గడిపేస్తునట్లు ఉంది.