Allu Sirish : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 : ది రూల్’ గత ఏడాది డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదలై సృష్టించిన సంచలనం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కమర్షియల్ గా ఈ సినిమాకి వచ్చిన వసూళ్లను చూసి ఏళ్ళ తరబడి ట్రేడ్ ని పరిశీలిస్తున్న వాళ్లకు కూడా మతి పోయినంత పని అయ్యింది. 1800 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, హిందీ లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. 50 రోజుల తర్వాత ఎడిటింగ్ లో తీసివేయబడ్డ కొన్ని సన్నివేశాలను జత చేసి రీ లోడెడ్ వెర్షన్ తో విడుదల చేసారు. దీనికి ఇంకా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఓటీటీ లో కూడా రీ లోడెడ్ వెర్షన్ ని అప్లోడ్ చేసారు. సినిమా నిడివి 3 గంటల 44 నిమిషాలు ఉన్నప్పటికీ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని దక్కించుకుంది.
‘దాన వీర సూర కర్ణ’ చిత్రం తర్వాత అత్యంత ఎక్కువ రన్ టైం ఉన్న సినిమా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ‘పుష్ప 2’. ఇంతటి నిడివి ఉన్నప్పటికీ కూడా ఆ రేంజ్ వసూళ్లను రాబట్టడం అనేది సాధారణమైన విషయం కాదు. భవిష్యత్తులో ఎవ్వరికీ సాధ్యం కానీ ఎన్నో అద్భుతాలను ఈ చిత్రం ద్వారా సృష్టించాడు అల్లు అర్జున్. ఇదంతా పక్కన పెడితే ఆయన సోదరుడు అల్లు శిరీష్ కాసేపటి క్రితమే ‘పుష్ప 2 రీ లోడెడ్’ వెర్షన్ గురించి సోషల్ మీడియా లో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘నెట్ ఫ్లిక్స్ లో రీ లోడెడ్ వెర్షన్ ని చూసాను. ఎందుకో ఈ రీ లోడెడ్ వెర్షన్ ని చూసిన తర్వాత నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. క్లైమాక్స్ లో అన్నదమ్ములు హత్తుకునే సన్నివేశాలకు నేను కన్నీళ్లు ఆపుకోలేకపోయాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఓటీటీ లో కూడా ‘పుష్ప 2’ చరిత్ర తిరగరాస్తూ ముందుకు దూసుకుపోతుంది. విడుదలైన 24 గంటల్లోనే 20 దేశాల్లో ట్రెండింగ్ అవుతూ సంచలనం సృష్టించిన ఈ సినిమా, ఫుల్ రన్ లో ఎన్ని వారాలు నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతుందో చూడాలి. ఇకపోతే అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘గాడ్ ఆఫ్ వార్’ సుబ్రమణ్య స్వామి జీవిత చరిత్రని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. త్రివిక్రమ్ మొట్టమొదటిసారి తనకి ఎంతో పట్టు ఉన్నటువంటి సబ్జెక్టు పై సినిమా తీస్తున్నాడు. అది కూడా ఆయన సబ్జెక్టు కి అల్లు అర్జున్ లాంటి కసి ఉన్న టాలెంటెడ్ హీరో దొరికాడు. ఇక ఈ చిత్రం ఎప్పుడు విడుదలైనా ఆకాశమే హద్దు అనే విధంగా వసూళ్లు ఉంటాయి.