Allu Kanakaratnam Passed Away: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు చిరంజీవి… కెరియర్ స్టార్టింగ్ లో చిరంజీవి అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న సమయంలో నటుడు అల్లు రామలింగయ్య తన చిన్న కూతురు అయిన సురేఖను చిరంజీవికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఇక అప్పటినుంచి చిరంజీవి వరుస సినిమాలు చేసుకుంటువచ్చాడు… చిరంజీవి తన బావమరిది అయిన అల్లు అరవింద్ స్థాపించిన గీతా బ్యానర్ లోనే ఎక్కువ సినిమాలు చేస్తూ వచ్చాడు… దానివల్ల ప్రొడ్యూసర్ గా అల్లు అరవింద్ టాప్ పొజిషన్ కి చేరుకున్నాడు. ఇక వీళ్లిద్దరి మధ్య చాలా మంచి అనుబంధమైతే ఉండేది. అయితే ఈరోజు ఉదయం అల్లు అరవింద్ వాళ్ళ అమ్మ అయిన కనకరత్నం గారు చనిపోయారు…
Also Read: రాజస్థాన్ రాయల్స్ నుంచి ద్రావిడ్ ఎందుకు తప్పుకున్నారు? కారణం అదేనా?
ఈ వార్త వినగానే ఇటు అల్లు ఫ్యామిలీ, అటు మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు తీవ్రమైన దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇక అల్లు అర్జున్ సైతం ముంబైలో షూటింగ్లో ఉన్నప్పటికి అది వదులుకోను మరి వాళ్ల నానమ్మ ను చివరి చూపు చూసుకోవడానికి అయితే వచ్చాడు. మరి ఏది ఏమైనా కూడా ఈరోజు మధ్యాహ్నం ఆమె అంత్యక్రియలైతే జరిగాయి… ఇక చిరంజీవి అంటే కనక రత్నం గారికి చాలా ఇష్టమట… చిరంజీవి సైతం ఆమె ను తన కన్నా తల్లి లాగా చూసుకునేవాడని పాలు సందర్భాల్లో తెలియజేశారు…
చిరంజీవి ఆమెను అత్తమ్మ అని కాకుండా అమ్మ అని పిలిచేవాడని పలు సందర్భాల్లో తెలియజేశారు. ఆమె చనిపోవడంతో చిరంజీవి తీవ్రమైన దుఖం లో మునిగిపోయాడు…ఇక తన అంతిమ యాత్రలో చిరంజీవి తన పాడే మోసి మరి ఆమె మీద ఉన్న ప్రేమను చాటుకున్నాడు. ఇక అల్లు అర్జున్ సైతం ఆ పాడే మోయడం విశేషం…గత కొన్ని రోజుల నుంచి మెగా, అల్లు ఫ్యామిలీ ల మధ్య కొంతవరకు విభేదాలు అయితే ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి.
ఇక ప్రస్తుతం రెండు కుటుంబాల సభ్యులు కలిసిపోయి ఆమె అంతిమ యాత్ర ను చాలా గ్రాండ్ గా నిర్వహించారు… మొత్తానికైతే చిరంజీవి సైతం తన భార్య సురేఖ ను ఓదార్చుతున్నప్పటికీ ఆమె చనిపోయినందుకు సురేఖ గారి కంటే చిరంజీవి ఇంకా ఎక్కువ బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది…ఇక మొత్తానికైతే ఆమె చాలా మంచి వ్యక్తి అని ప్రతి ఒక్కరు తెలియజేస్తుండటం విశేషం…