Vishnu Manchu- Allu Family: టాలీవుడ్ లో గత కొంతకాలం నుండి మెగా ఫామిలీ కి మరియు మంచు ఫామిలీ కి మధ్య విభేదాలు ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే..మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికలే అందుకు కారణం..ఈ ఎన్నికలు అయిపోయి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఈ ఇరువురి కుటుంబాల మధ్య సఖ్యత కుదర్లేదు..మంచు విష్ణు ఇప్పటికి బయటకి వచ్చినప్పుడల్లా పరోక్షంగా మెగా ఫామిలీ పై సెటైర్లు వేస్తూనే ఉన్నాడు..ఈమధ్య కూడా తనపై మరియు తన కుటుంబం పై జూబ్లీ హిల్స్ వద్ద ఉన్న ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ లో 20 మంది ఎంప్లాయిస్ ట్రోల్ల్స్ చేస్తున్నారని..ఈ ట్రోల్ల్స్ చేస్తున్నవారి IP అడ్రస్ కనుక్కుంటే అది ఒక ప్రముఖ స్టార్ హీరో ఆఫీస్ నుండి వెళ్తుందని తెలిసింది..వీరిపై ఇప్పుడు పోలీస్ కేసు పెట్టబోతున్నాను అంటూ పరోక్షంగా మెగా ఫామిలీ కుటుంబం ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో ఎలా వైరల్ గా మారిందో మన అందరికి తెలిసిందే.

ఇది ఇలా ఉండగా రేపు నందమూరి బాలకృష్ణ వ్యాక్యతగా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK 2 ‘ టాక్ షో ప్రారంభం అవుతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సందర్భంగా రేపు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చెయ్యనున్నారు..ఈ సమావేశానికి నందమూరి బాలకృష్ణ తో పాటుగా మంచు మోహన్ బాబు మరియు మంచు విష్ణు వర్ధన్ బాబు కూడా హాజరు కాబోతున్నారు..చిరంజీవి మీద పరస్పరం ఛలోక్తులు మరియు సమయం దొరికినప్పుడల్లా విషం చిమ్ముతున్న మంచు కుటుంబాన్ని ఆహా నిర్మాత అల్లు అరవింద్ ఇంత దగ్గరకు తీసుకొని రావడం లో ఆయన ఆంతర్యం ఏమిటి..చిరంజీవి కి వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారా..?

గత కొంత కాలం నుండి మెగా ఫామిలీ తో అల్లు ఫామిలీ కి విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలకు బలం చేకూర్చడానికి మంచు కుటుంబానికి అల్లు ఫామిలీ దగ్గర అవుతుందా..దీని ద్వారా అభిమానులకు ఎలాంటి సంకేతాలు ఇవ్వాలని చూస్తున్నారంటూ అల్లు అరవింద్ పై మెగా ఫాన్స్ సోషల్ మీడియా లో విరుచుకుపడుతున్నారు.


