Rishab Shetty- Allu Arvind: కాంతారా మూవీతో అల్లు అరవింద్ కోట్లు కొల్లగొడుతున్నారు. కేవలం రెండు కోట్ల పెట్టుబడితో భారీ లాభాలు ఆర్జిస్తున్నారు. ఫస్ట్ డేనే కాంతార బ్రేక్ ఈవెన్ కాగా రెండో రోజు నుండే లాభాలు పంచుతుంది. వర్కింగ్ డేస్ లో కూడా కాంతార వసూళ్ల జోరు తగ్గలేదు. చాలా తక్కువ డ్రాప్ కనిపించింది. నెక్స్ట్ వీకెండ్ కూడా కాంతార బాక్సాఫీస్ వద్ద ఆదరణ దక్కించుకునే సూచనలు కలవు. తెలుగు ప్రేక్షకులు కాంతర మూవీని విపరీతంగా ఇష్టపడుతున్నారు. ఓపెనింగ్ డే కాంతార రూ. 2 కోట్ల షేర్ రాబట్టింది. సెకండ్ డే వసూళ్లు పెరగగా రూ. 2.85 షేర్ అందుకుంది. ఇక వర్కింగ్ డేస్ సోమవారం రూ.1.75 కోట్లు, మంగళవారం రూ. 1.85 కోట్ల షేర్ వసూలు చేసింది.

2021లో భారీ లాభాలు మిగిల్చిన డబ్బింగ్ చిత్రాల జాబితాలో కాంతార చేరింది. కమల్ హాసన్ విక్రమ్ తర్వాత ఆ రేంజ్ లో కాంతార లాభాలు పంచింది. తెలుగు హక్కులు దక్కించుకున్న అల్లు అరవింద్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఒక స్టార్ హీరోతో సినిమా తీసినా రాని లాభాలు డబ్బింగ్ మూవీతో పొందుతున్నారు. ఈ క్రమంలో కాంతార యూనిట్ తో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.
కాంతార చిత్ర హీరో, రచయిత, దర్శకుడు రిషబ్ శెట్టి ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. కాంతార చిత్రాన్ని ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేదికగా అల్లు అరవింద్ ఆసక్తికర విషయం బయటపెట్టారు. రిషబ్ శెట్టి తన బ్యానర్ లో మూవీ చేయాలని మాట తీసుకున్నట్లు వెల్లడించారు. రిషబ్ శెట్టి గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మూవీ చేసేందుకు ఒప్పుకున్నట్లు అల్లు అరవింద్ తెలియజేశారు. ఈ క్రమంలో అల్లు అరవింద్ తెలివిగా రిషబ్ శెట్టిని లాక్ చేశాడని టాలీవుడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నారు.

మరి అల్లు అరవింద్ అంటే మామూలోడా… ఆయన నిర్ణయాలు, ప్రణాళికలు చాలా పకడ్బందీగా ఉంటాయి. టాలెంట్ పుష్కలంగా ఉన్న రిషబ్ శెట్టితో మూవీ కన్ఫర్మ్ చేయించి మరో హిట్ మూవీకి పునాది వేసుకున్నాడు. ఇక కాంతార వరల్డ్ వైడ్ అన్ని భాషల్లో కలిపి రూ. 200 కోట్ల మార్క్ చేరుకున్నట్లు తెలుస్తుంది. కెజిఎఫ్ నిర్మాతలైన హోమబుల్స్ బ్యానర్లో కాంతార తెరకెక్కింది.