Allu Arjun: టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించి ప్రస్తుతం ఐకాన్ స్టార్ గా ఎదిగాడు అల్లు అర్జున్. సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి.. ఈ సినిమాకు సీక్వెల్ తో బిజీ అయిపోయాడు బన్నీ. పుష్ప పార్ట్ 1 బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పాన్ ఇండియా రేంజ్ లో అభిమానులను సంపాదించారు అల్లు అర్జున్. అయితే అల్లు అర్జున్ సినిమాలలో చాలా సరదాగా ఉంటారు. అంతేకాదు బయట కూడా అదే రాపో మెయింటెన్ చేస్తారట ఈ ఐకాన్ స్టార్. మరి ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు అనుకుంటున్నారా? అయితే ఇది చదివేసేయండి.
ఒక సినిమా షూటింగ్ సమయంలో చిత్ర బృందంతో చాలా సరదాగా ఉన్నారట బన్నీ. అందరితో ఉన్నట్టుగానే సినిమాలో నటించే హీరోయిన్ తో కూడా చనువుగా ఉన్నారట. కానీ బన్నీ స్టైల్, బిహేవియర్ నచ్చి ఆమె బన్నీ విషయంలో కాస్త తేడాగా బిహేవ్ చేసిందని టాక్. అప్పటికే అల్లు అర్జున్ కు స్నేహ రెడ్డితో పెళ్లి జరిగింది. ఒక కుమారుడు కూడా ఉన్నారు. కానీ ఆ హీరోయిన్ అల్లు అర్జున్ పై మోజు పడటమే కాకుండా సినిమా సాకుతో అర్ధరాత్రి సమయంలో అల్లు అర్జున్ కు ఫోన్ చేసేదట.ప్రైవేట్ పార్టీలకు వెళ్లినా కూడా బన్నీకి పదే పదే ఫోన్ చేయడంతో స్నేహ రెడ్డికి అనుమానం వచ్చిందట.
కోపం వచ్చిన బన్నీ భార్య ఆ హీరోయిన్ కు ఫోన్ చేసి తన స్టైల్ లో వార్నింగ్ ఇచ్చిందని టాక్. అంతే కాదు బన్నీ దగ్గర కూడా ప్రామిస్ తీసుకుందట. ఎలాంటి సందర్భంలో కూడా ఆ హీరోయిన్ తో మరో సినిమా చేయవద్దు అని మాట తీసుకుందట స్నేహ రెడ్డి. పెళ్లై పిల్లలు ఉన్న బన్నీతో సన్నిహితంగా మాట్లాడడంతో స్నేహ వార్నింగ్ ఇచ్చింది. దీంతో మరోసారి ఆమె అల్లు అర్జున్ తో మాట్లాడలేదు అని టాక్. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆ సినిమా మంచి సక్సెస్ అందుకుంది .అంతే కాదు మరో సినిమా కూడా వీరు చేశారట. రెండో సినిమా సమయంలోనే స్నేహ రెడ్డి వార్నింగ్ ఇచ్చారట. అప్పటి నుంచి వీరి కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు.