
Allu Arjun’s PushpaRaj Character: అల్లు అర్జున్ ( Allu Arjun) హీరో కాదు, తనను తానూ హీరోగా మలుచుకున్న కష్ట జీవి. బన్నీ మొదటి సినిమా చూసినపుడు చాలా మంది అభిప్రాయం ఒక్కటే… నెపోటిజంకు ఇది పరాకాష్ట అని. సినిమాకి హీరోకి ఎక్కడా పొంతన లేదు అంటూ నానా రచ్చ చేశారు ఆ రోజుల్లో. కానీ ఆ తరవాత రిలీజ్ అయింది ఆర్య. హీరో అంటే ఇలానే ఉండాలి అనే స్థాయిలో తన లుక్ ను మార్చుకున్నాడు బన్నీ.
ఇక అప్పటి నుంచి బన్నీ వెనక్కి తిరిగిచూసుకోలేదు. హీరోకి పర్యాయపదం అయ్యాడు. స్టైలిష్ స్టార్ అయ్యాడు. బన్నీ సినిమాలు ఎలా ఉన్నా.. బన్నీ పాత్రల ఎంపిక, నటన ముఖ్యంగా డ్యాన్స్ ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకున్నాయి. ఏవరేజ్ హీరో నుంచి స్టార్ హీరోగా మారడానికి బన్నీ చేసిన కృషి అమోహం.
పైగా రుద్రమదేవిలో గోనగన్నారెడ్డి పాత్రలో నటించడానికి ఒప్పుకోవడం మరో గొప్ప విషయం. నటన పరంగా బన్నీలో బాగా పరిణితి చెందినట్టు అనిపిస్తోంది ఆ సినిమాలో. ఆ మాటకొస్తే బన్నీ మొదటి నుంచి తాను చేసిన ప్రతి సినిమాలో పాత్రల్లో, ఆహార్యంలో వైవిధ్యం ఉండేలా చూసుకున్నాడు.
అల వైకుంఠపురంలో వంటి పరమ రొటీన్ చిత్రంలోనూ బన్నీ పాత్ర అందరికీ బాగా నచ్చింది అంటే.. కారణం బన్నీనే. తన నటనతో నవరసాలను కన్విన్సింగ్ గా పలికించాడు. ఇక ప్రస్తుతం బన్నీ సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప సినిమా చేస్తున్నాడు. సుకుమార్ ఉలి దెబ్బకు రామ్ చరణ్ లాంటి హీరోనే మంచి నటుడైనప్పుడు, అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా నటన పరంగా మరో స్థాయికి వెళ్తాడు అంటూ ఆ సినిమా యూనిట్ బలంగా నమ్ముతుంది.